AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20I World Cup 2026: నాడు హకీ ప్లేయర్.. నేడు క్రికెటర్‌గా.. మల్టీ ట్యాలెంట్‌తో మెంటలెక్కిస్తున్నాడుగా..

Italy Captain Wayne Madsen: టీ20 ప్రపంచకప్ 2026 బరిలో నిలిచిన ఆటగాళ్లలో కొంతమంది ప్రత్యేకతను సంతరించుకున్నారు. ఒరు రిటైర్మెంట్ తర్వాత రీఎంట్రీ ఇవ్వనుండగా, మరొకరు హకీ ప్లేయర్ నుంచి ఓ జట్టుకు కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నారు. ఇలాంటి ప్లేయర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

T20I World Cup 2026: నాడు హకీ ప్లేయర్.. నేడు క్రికెటర్‌గా.. మల్టీ ట్యాలెంట్‌తో మెంటలెక్కిస్తున్నాడుగా..
Wayne Madsen
Venkata Chari
|

Updated on: Feb 04, 2026 | 1:21 PM

Share

Italy Captain Wayne Madsen: టీ20 ప్రపంచకప్ 2026కు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే అన్ని జట్లు తమ స్వ్కాడ్ లను ప్రకటించాయి. అయితే, కొన్ని జట్లు యువ ఆటగాళ్లకు అవకాశాలను అందించగా, మరికొన్ని టీంలు సీనియర్ ప్లేయర్లకు పట్టం కట్టాయి. ఈ క్రమంలో సీనియర్ ప్లేయర్ పై అందరి ఆసక్తి నెలకొంది. ఇతను మాజీ హాకీ ప్లేయర్. హాకీ ప్రపంచ కప్ కూడా ఆడాడు. తాజాగా 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఆడబోతున్నాడు. దీంతో తన పేరుతో ఓ ప్రత్యేక రికార్డ్ లిఖించనున్నాడు. 2006 హాకీ ప్రపంచ కప్‌లో తన దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఈ ఆటగాడు క్రికెట్‌లో ఊహించని రెండవ కెరీర్‌తో ఆకట్టుకుంటున్నాడు. అంటే, హాకీ మైదానం నుంచి క్రికెట్ మైదానానికి మారిన ఈ ప్లేయ్ ఎవరో ఓసారి తెలుసుకుందాం..

టీ20 ప్రపంచ కప్ 2026లో ఆడనున్న ఇటలీ జట్టులో కీలక ప్లేయర్ గా బరిలోకి దిగబోతున్న వేన్ మాడ్సెన్ కెరీర్ ఎంతో ప్రత్యేకమైనది. పూర్తిగా భిన్నమైన రెండు క్రీడలలో ఈ ప్లేయర్ తన పేరుతో ప్రత్యేక రికార్డ్ లిఖించబోతున్నాడు.

ఇటలీ చారిత్రాత్మక టీ20 ప్రపంచకప్ అరంగేట్రం..

2026 టీ20 ప్రపంచ కప్‌లో 20 జట్లు పాల్గొంటున్నాయి. కానీ, ఈ ఎడిషన్ ఇటలీకి ప్రత్యేక ప్రాముఖ్యతను తీసుకరానుంది. టీ20 ప్రపంచ కప్‌లో తొలిసారిగా పాల్గొనడంతో ఇటాలియన్ క్రికెట్‌కు చారిత్రాత్మక మైలురాయిగా మారనుంది.

ఇది కూడా చదవండి: Team India: అభిషేక్, సూర్య కాదు భయ్యో.. టీ20 ప్రపంచకప్ లో విదేశీ బౌలర్ల పాలిట విలన్‌గా ‘ఛోటా ప్యాకెట్’

ఇంగ్లాండ్, వెస్టిండీస్, స్కాట్లాండ్, నేపాల్ లతో పాటు గ్రూప్ సిలో ఉన్న ఇటలీ, తన తొలి సీజన్‌లో కఠినమైన సవాలును ఎదుర్కోవలసి ఉంటుంది. ఫిబ్రవరి 9న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో స్కాట్లాండ్‌తో తొలి మ్యాచ్ జరుగుతుంది. ప్రపంచ వేదికపై తమ స్థానాన్ని నిరూపించుకోవాలనే ఆసక్తితో ఉన్న ఇటలీకి బలమైన ప్రారంభం చాలా కీలకం.

ఈ క్రమంలో ఇటలీ కెనడాతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో విజయం సాధించింది. ఈ ఫలితం జట్టు ఆత్మస్తైర్యాన్ని పెంచనుంది. అలాగే, ఇటలీ కెప్టెన్ వేన్ మాడ్సెన్ పై అందరి దృష్టి ఉంది. దక్షిణాఫ్రికాలో జన్మించిన మాడ్సెన్.. రెండు వేర్వేరు క్రీడలలో రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన మొదటి పురుష క్రికెటర్‌గా అవతరించడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రికెట్‌లో ఇటలీకి కెప్టెన్‌గా వ్యవహరించే ముందు, అతను కేవలం 22 సంవత్సరాల వయస్సులో 2006 హాకీ ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు.

ఆ హాకీ ప్రపంచ కప్ ముందే అతను 2004లో క్వాజులు-నాటల్ తరపున ఫస్ట్-క్లాస్, లిస్ట్-ఎ క్రికెట్ ఆడాడు. ప్రారంభంలోనే తన ఇలా మల్టిట్యాలెండెట్ ప్రతిభను చూపించాడు. ఇప్పుడు అతను 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఇటాలియన్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

కౌంటీ క్రికెట్ నుంచి ఇటలీ కెప్టెన్ వరకు..

మాడ్సెన్ ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో డెర్బీషైర్‌తో సుదీర్ఘమైన కెరీర్‌ను కలిగి ఉన్నాడు. అతను ఇంగ్లాండ్ తరపున ఆడటానికి అర్హత సాధించాడు. రెండు దేశాల తరపున సీనియర్ అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం ఎప్పుడూ రాలేదు. ఈ నిరాశ చివరికి అతన్ని కొత్త మార్గంలో నడిపించింది.

ఇది కూడా చదవండి: PCB vs ICC: ఐసీసీకి పోటీగా మరో క్రికెట్ బోర్డ్ ఏర్పాటు.. ఆ రెండు దేశాల మద్దతుతో పాక్ దూకుడు..?

జులై 2023లో, మాడ్సెన్ ఇటలీ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి అతను 7 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 132.25 స్ట్రైక్ రేట్‌తో 205 పరుగులు చేశాడు. వాటిలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20 క్రికెట్‌లో అతని మొత్తం అనుభవం ఎంతో విస్తృతమైనది. దాదాపు 219 మ్యాచ్‌ల్లో 5,516 పరుగులు, 2 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

తాజాగా మాడ్సెన్ టీ20 ప్రపంచ కప్‌ లో ఇటలీ జట్టుకు నాయకత్వం, అనుభవాన్ని అందించనున్నాడు. వార్మప్ మ్యాచ్‌లలో విజయం సాధించడంతో మానసికంగా సిద్ధమయ్యాడు. ఇటలీ 2026 టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనడమే కాకుండా బలమైన పోటీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి

T20I World Cup 2026: నాడు హకీ ప్లేయర్.. నేడు క్రికెటర్‌గా..
T20I World Cup 2026: నాడు హకీ ప్లేయర్.. నేడు క్రికెటర్‌గా..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. ఆ వైబ్ వేరెలెవల్..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. ఆ వైబ్ వేరెలెవల్..
ఉసిరికాయ పచ్చడి ఇలా చేసుకుని తింటే.. మటన్, చికెన్ కూడా సరిపోవు!
ఉసిరికాయ పచ్చడి ఇలా చేసుకుని తింటే.. మటన్, చికెన్ కూడా సరిపోవు!
సింహం ముందే కుప్పిగంతులా.! PSLపై బ్యాన్ దిశగా ఐసీసీ అల్టిమేటం..
సింహం ముందే కుప్పిగంతులా.! PSLపై బ్యాన్ దిశగా ఐసీసీ అల్టిమేటం..
మీ ఆధార్‌ను ఎవరైనా తప్పుగా వాడారా..? ఆన్‌లైన్‌లో ఇలా తెలుసుకోండి
మీ ఆధార్‌ను ఎవరైనా తప్పుగా వాడారా..? ఆన్‌లైన్‌లో ఇలా తెలుసుకోండి
పచ్చి అరటి పవర్‌ఫుల్‌ బెనిఫిట్స్‌.. తప్పక తెలుసుకోవాలి!
పచ్చి అరటి పవర్‌ఫుల్‌ బెనిఫిట్స్‌.. తప్పక తెలుసుకోవాలి!
సమతా కుంభ్ బ్రహ్మోత్సవాల్లో అద్భుతం.. కనులపండువగా శాంతి కల్యాణ..
సమతా కుంభ్ బ్రహ్మోత్సవాల్లో అద్భుతం.. కనులపండువగా శాంతి కల్యాణ..
గుర్రం కాదు.. నడిచే సంపద..? విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది గురూ.!
గుర్రం కాదు.. నడిచే సంపద..? విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది గురూ.!
2007 నుంచి 2026 వరకు.. టీ20 ప్రపంచ కప్ హిస్టరీలోనే తొలి ప్లేయర్?
2007 నుంచి 2026 వరకు.. టీ20 ప్రపంచ కప్ హిస్టరీలోనే తొలి ప్లేయర్?
చంద్రహాస్ వరస్ట్ సాంగ్ పై జేడీ చక్రవర్తి రియాక్షన్..
చంద్రహాస్ వరస్ట్ సాంగ్ పై జేడీ చక్రవర్తి రియాక్షన్..