IND vs SA: టీ20 అంటే ఇట్ల ఉండాలే.!.. ట్విస్టుల మీద ట్విస్టులు.. చివరికి..

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ దక్షిణాఫ్రికాకు 125 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే లక్ష్యాన్ని చేధించడంలో మొదట తడబడ్డ సౌతాఫ్రికా చివర్లో రాణించింది. స్టబ్స్(47), కోయోట్జీ(19) పరుగులు చేశారు. మరో ఓవర్ ఉండగానే టార్గెట్‌ను స్టబ్స్, కోయోట్జీ అలవోకగా చేధించారు.

IND vs SA: టీ20 అంటే ఇట్ల ఉండాలే.!.. ట్విస్టుల మీద ట్విస్టులు.. చివరికి..
Ind Vs Sa
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Nov 11, 2024 | 12:19 AM

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇప్పటికే 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమైంది. డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా సులువుగా విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు సెయింట్ జార్జ్ పార్క్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య సిరీస్‌లో రెండో మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టు దక్షిణాఫ్రికాకు 125 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హార్దిక్(39), అక్షర్ (27), తిలక్ వర్మ(20) పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లు మార్కో జాన్సన్, గెరాల్డ్ కూటీస్, ఆండిల్ సిమెలన్, ఐడెన్ మార్క్రామ్, ఎన్ పీటర్ తలో వికెట్ తీశారు.

అయితే లక్ష్యాన్ని చేధించడంలో మొదట తడబడ్డ సౌతాఫ్రికా చివర్లో రాణించింది. స్టబ్స్(47), కోయోట్జీ(19) పరుగులు చేశారు. మరో ఓవర్ ఉండగానే టార్గెట్‌ను స్టబ్స్, కోయోట్జీ అలవోకగా చేధించారు. ఈ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి 5 వికెట్ల తీసి అదరగొట్టిన ప్రయెజనం లేకుండా పోయింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి