IND vs SA: దుమ్ములేపిన భారత బౌలర్లు.. 199 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా..

IND vs SA: భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. 199 పరుగులకే సౌతాఫ్రికాను కుప్పకూల్చారు.

IND vs SA: దుమ్ములేపిన భారత బౌలర్లు.. 199 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా..
Ind Vs Sa
Follow us
uppula Raju

|

Updated on: Dec 28, 2021 | 9:08 PM

IND vs SA: భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. 199 పరుగులకే సౌతాఫ్రికాను కుప్పకూల్చారు. దీంతో ఇండియాకి 130 పరుగుల ఆధిక్యం లభించింది. టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 327 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం బ్యాటింగ్ చేపటిన సౌతాఫ్రికాకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 2 పరుగులకే ఒక వికెట్‌ కోల్పోయింది. రెండో సెషన్ ప్రారంభంలోనే మరో వికెట్ కోల్పోయింది. ఇలా వరుసగా వికెట్లు పోతూనే ఉన్నాయి.

భారత బౌలర్ల ముందు ఎవ్వరు నిలవలేకపోయారు. టెంబా బవుమా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీ సాధించి కనీసం 150 పరుగులు దాటేలా చేశాడు. క్వింటన్‌ డికాక్ 34 పరుగులు పర్వాలేదనిపించాడు. మిగతా వారెవ్వరు పెద్దగా రాణించలేదు. దీంతో సౌతాఫ్రికా 199 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లలో మహ్మద్‌ షమి 5, శార్దుల్‌ 2, బుమ్రా, సిరాజ్‌, ఒక్కో వికెట్ చొప్పున సాధించారు. దీంతో భారత్ 130 పరుగుల ఆధిక్యం సంపాదించింది.

అంతకు ముందు మూడోరోజు 276 పరుగులతో బ్యాటింగ్‌ ప్రారంభిన భారత్ 327 పరుగులకే ఆలౌట్‌ అయింది. కేవలం 55 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లను చేజార్చుకుంది. ఎవ్వరు కనీసం రెండెకల స్కోరు కూడా చేయలేకపోయారు. దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి భారత్‌ని కుప్పకూల్చాడు. వరుసగా వికెట్లు తీస్తు కోలుకోలేని దెబ్బతీశాడు. ఏకంగా 6 వికెట్లు సాధించాడు. ఇతనికి తోడుగా కాగిసో రబడా 3 వికెట్లు తీశాడు. ఫలితంగా భారత్‌ 327 పరుగులకు ఆలౌట్ అయింది.