AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL-2022 Auction: మరో మూడేళ్లు ఆడతాను.. వచ్చే ఐపీఎల్‎లో చెన్నైకే ఆడాలని ఉంది..

భారత మాజీ బ్యాటర్ అంబటి రాయుడు రాబోయే మూడేళ్లపాటు ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022కు సిద్ధమవుతున్నాడు....

IPL-2022 Auction: మరో మూడేళ్లు ఆడతాను.. వచ్చే ఐపీఎల్‎లో చెన్నైకే ఆడాలని ఉంది..
Rayudu
Srinivas Chekkilla
|

Updated on: Dec 28, 2021 | 8:16 PM

Share

భారత మాజీ బ్యాటర్ అంబటి రాయుడు రాబోయే మూడేళ్లపాటు ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022కు సిద్ధమవుతున్నాడు. 36 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ జులై 2019 లో భారత క్రికెట్‎కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రాబోయే ఐపీఎల్ సీజన్‌కు సీఎస్‌కే ఎంపిక చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. “నేను మంచి ఫామ్, ఫిట్‌గా ఉన్నంత వరకు ఆడుతూనే ఉంటాను. నేను తదుపరి 2022 ఐపీఎల్‎కు సిద్ధంగా ఉన్నాను. నా ఫిట్‌నెస్‌పై నేను తీవ్రంగా కృషి చేస్తున్నాను” అని రాయుడు చెప్పాడు. ఇటీవల విజయ్ హజారేలో ట్రోఫీలో రాయుడు ఆంధ్రా తరఫు ఆడాడు. “నేను ఇటీవల విజయ్ హజారే ట్రోఫీని ఆడాను. నేను మంచి స్థితిలో ఉన్నాను. కనీసం రాబోయే మూడేళ్లపాటు ఆడాలని ఆశిస్తున్నాను.” అని చెప్పాడు.

“2019 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకోనందుకు నాకు నిరాశ కలిగించింది. నా పునరాగమనం CSKకి అంకితం చేశాను.” అని అన్నాడు. నాలుగుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌తో తన స్థానం ప్రత్యేకమైనదని రాయుడు భావిస్తున్నాడు. “CSKతో నా స్థానం చాలా ప్రత్యేకమైనది. మేము ఇప్పటి వరకు రెండు IPLలు గెలిచాం. 2018 చాలా ప్రత్యేకమైన సీజన్, CSKకి పునరాగమనం సీజన్. మేము ఆ సంవత్సరం IPLని గెలుచుకోవడం చాలా ప్రత్యేకమైనది.” అని వివరించాడు.

“ధోనీ భాయ్ నా నుంచి ఉత్తమ ప్రదర్శన చూశాడు. నాపైనే కాదు అతను అందరిపైనా ప్రభావం చూపాడు. జట్టులోని ప్రతి ఒక్కరిలో విశ్వాసం తీసుకువస్తాడు. అందుకే అతను భారతదేశానికి అత్యుత్తమ కెప్టెన్ ” అని చెప్పాడు. ” నేను ఖచ్చితంగా CSK కోసం ఆడటానికి ఇష్టపడతాను. అధికారికంగా ఇప్పటి వరకు నాతో ఎలాంటి సంభాషణలు జరగలేదు, కానీ వారి ద్వారా ఎంపికై మళ్లీ లీగ్ విజయవంతమవుతానని ఆశిస్తున్నాను” అని చెప్పాడు. సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనితో పాటు రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీని రిటైన్ చేసుకుంది.

Read Aslo..  IND vs SA: పొరపాటు చేసిన రిషబ్ పంత్.. పుజారాకు తృటిలో తప్పిన ప్రమాదం.. అసలు ఏం జరిగిందంటే..