IND vs SA: పొరపాటు చేసిన రిషబ్ పంత్.. పుజారాకు తృటిలో తప్పిన ప్రమాదం.. అసలు ఏం జరిగిందంటే..
సెంచూరియన్ టెస్టులో మూడో రోజు భారత బౌలర్లకు శుభారంభం లభించింది. షమీ, బుమ్రా, సిరాజ్‌లు కలిసి దక్షిణాఫ్రికా టాప్ 4 బ్యాట్స్‌మెన్లను కేవలం 32 పరుగులకే అవుట్ చేశారు...
సెంచూరియన్ టెస్టులో మూడో రోజు భారత బౌలర్లకు శుభారంభం లభించింది. షమీ, బుమ్రా, సిరాజ్‌లు కలిసి దక్షిణాఫ్రికా టాప్ 4 బ్యాట్స్‌మెన్లను కేవలం 32 పరుగులకే అవుట్ చేశారు. అయితే 10వ ఓవర్‌లో ఐడెన్ మార్క్‌రమ్ క్యాచ్‌ను వికెట్ కీపర్ రిషబ్ పంత్ జారవిడిచాడు. అదే సమయంలో అతని కారణంగా ఛతేశ్వర్ పుజారాకు పెద్ద గాయం అయ్యేది. అయితే అదృష్టవశాత్తూ పుజారా తృటిలో తప్పించుకున్నాడు.
మహ్మద్ షమీ వేసిన బంతి ఏడెన్ మార్క్రామ్ బ్యాట్ వెలుపలి అంచుతో వికెట్ వెనుకకు వెళ్లింది. పంత్ తన కుడివైపునకు డైవ్ చేసాడు. కానీ బంతి అతని గ్లవ్స్‌కు తగిలి మొదటి స్లిప్‌లో నిలబడి ఉన్న పుజారా వైపు వెళ్లింది. బంతి పుజారా ఛాతీకి తగిలింది. బంతి 2 అంగుళాలు పైకి లేస్తే పుజారా నోటికి తీవ్ర గాయం అయ్యేది.
ఐడెన్ మార్క్రామ్‌ను 12వ ఓవర్‌లో షమీ ఔట్ చేశాడు. బంతి పిచ్‌పైకి రావడంతో మార్క్రామ్ అర్థం చేసుకోలేకపోయాడు. 13 పరుగుల వద్ద మార్క్రామ్ ఔటయ్యాడు. షమీ అంతకు ముందు కీగన్ పీటర్సన్‌ను కూడా బౌల్డ్ చేశాడు.
Read Also.. IND vs SA: జస్ప్రీత్ బుమ్రా కాలికి గాయం.. కీలక ప్రకటన చేసిన బీసీసీఐ..