IND vs SA: జస్ప్రీత్ బుమ్రా కాలికి గాయం.. కీలక ప్రకటన చేసిన బీసీసీఐ..
సెంచూరియన్ టెస్టులో మూడో రోజు టీమ్ ఇండియా 327 పరుగులకే కుప్పకూలింది. భారత్ చివరి 7 వికెట్లు కేవలం 49 పరుగులకే కోల్పోయింది...
సెంచూరియన్ టెస్టులో మూడో రోజు టీమ్ ఇండియా 327 పరుగులకే కుప్పకూలింది. భారత్ చివరి 7 వికెట్లు కేవలం 49 పరుగులకే కోల్పోయింది. మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ దిగిన సౌతాఫ్రికాను ఆదిలోనే దెబ్బ తీశాడు జస్ప్రీత్ బుమ్రా. తన తొలి ఓవర్ ఐదో బంతికి దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్‌ను అవుట్ చేశాడు. బుమ్రా వేసిన బంతి ఎల్గర్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చాడు. అయితే జస్ప్రీత్ బుమ్రా తన ఆరో ఓవర్‌లో గాయపడ్డాడు. 11వ ఓవర్ ఐదవ బంతిని బౌలింగ్ చేస్తున్నప్పుడు, జస్ప్రీత్ బుమ్రా కాలు మలుచుకుపోయింది. దీంతో అతని చీలమండకు గాయమైనట్లు తెలుస్తుంది. జస్ప్రీత్ బుమ్రా చాలా బాధతో నేలపై పడుకున్నాడు. భారత జట్టు ఫిజియో వెంటనే మైదానానికి వచ్చి బుమ్రాను తీసుకెళ్లాడు. ఆ తర్వాత బుమ్రా కుడి కాలుకు కట్టు కట్టుకున్నాడు.
జస్ప్రీత్ బుమ్రా దక్షిణాఫ్రికా టూర్‌లో ఇండియాకు కీలకంగా ఉన్నాడు. దక్షిణాఫ్రికా పిచ్‌లపై అతని బౌలింగ్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు పెద్ద సవాలు లాంటిది. ఇలాంటి పరిస్థితుల్లో బుమ్రాకు గాయం అయితే టీమ్ ఇండియాకు పెద్ద దెబ్బే. బుమ్రా తన టెస్ట్ కెరీర్‌ను 3 సంవత్సరాల క్రితం దక్షిణాఫ్రికా పర్యటన నుంచి ప్రారంభించాడు. అరంగేట్రం సిరీస్‌లోనే 14 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌కు ముందు బుమ్రాకు చాలా విశ్రాంతి లభించింది. అతను న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్, టీ20 సిరీస్‌లలో ఆడలేదు. జస్ప్రీత్ బుమ్రా గాయం గురించి బీసీసీఐ కూడా అప్‌డేట్ ఇచ్చింది. జస్ప్రీత్ బుమ్రా స్ట్రెయిట్ లెగ్ చీలమండ మెలితిరిగిందని చెప్పింది. బుమ్రా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని తెలిపింది. అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ చేశాడు.
Bumrah twist his ankle , Siraj to finish the over Team India will be hoping , its not a major injury #SAvIND #INDvsSA #FreedomTestSeries #Bumrah pic.twitter.com/iminasLFCy
— Pushkar Pushp (@ppushp7) December 28, 2021
Read Also.. Andrew tye: రెండు బంతులు అలా వేశాడు అంతే.. మిగతా ఓవర్లు వేయకుండా నిషేధం విధించారు..