AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganguly vs Kohli: గంభీర్‌తో కటీఫ్.. టచ్‌లోకి గంగూలీ.. మూడు రోజుల్లోనే మారిన సీన్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..

Sourav Ganguly vs Virat Kohli: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత, క్రికెట్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓ సీన్ తెరపై కనిపించింది. ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ, RCB ఆటగాడు విరాట్ కోహ్లీ మ్యాచ్ తర్వాత కరచాలనం చేసుకోవడం కనిపించింది.

Ganguly vs Kohli: గంభీర్‌తో కటీఫ్.. టచ్‌లోకి గంగూలీ.. మూడు రోజుల్లోనే మారిన సీన్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..
Virat Vs Ganguly
Venkata Chari
|

Updated on: May 07, 2023 | 4:27 PM

Share

Virat Kohli vs Gautam Gambhir: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత, క్రికెట్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓ సీన్ తెరపై కనిపించింది. ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ, 0 RCB ఆటగాడు విరాట్ కోహ్లీ మ్యాచ్ తర్వాత కరచాలనం చేసుకోవడం కనిపించింది. అయితే, ఈసారి ఈ అనుభవజ్ఞులిద్దరూ ఒకరినొకరు చాలా కూల్‌గా షేక్ హ్యాండ్స్ చేసుకున్నారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది. ముఖ్యంగా అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఢిల్లీ-బెంగళూరు మధ్య జరిగిన గత మ్యాచ్‌లో ఇరజట్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వైపు విరాట్ కోహ్లీ కోపంగా కనిపించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇద్దరూ కరచాలనం కూడా చేసుకోలేదు. ఆ తర్వాత వారిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసినట్లు నివేదికలు కూడా వచ్చాయి.

ఇవి కూడా చదవండి

ఏడాదిన్నర క్రితం మొదలైన గొడవ..

సౌరవ్‌, విరాట్‌ల మధ్య గొడవలు జరిగి ఏడాదిన్నర అయింది. 2021 డిసెంబర్‌లో తొలిసారి ఇద్దరి మధ్య వివాదం తెరపైకి వచ్చింది. సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండగా, వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తొలగించారు. నిరంతర పేలవమైన ఫామ్, ICC ట్రోఫీని గెలవకపోవడంతో, విరాట్ వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించబడ్డాడు. ఆ తర్వాత విరాట్ విలేకరుల సమావేశంలో సౌరవ్ గంగూలీని టార్గెట్ చేశాడు.

అయితే నిన్న రాత్రి వెలుగులోకి వచ్చిన ఈ సీన్ తర్వాత వీరిద్దరి మధ్య వివాదం సద్దుమణుగుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ అనుభవజ్ఞులు ఖచ్చితంగా ఒకరితో ఒకరు కరచాలనం చేసుకున్నారు. కానీ, మాట్లాడుకోలేదు. అలాగే వారి ముఖాల్లో చిరునవ్వు కూడా కనిపించలేదు.

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఏకపక్షంగా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన RCB 181 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభం నుంచి దూకుడిగా 20 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫిల్ సాల్ట్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. అతను 45 బంతుల్లో 87 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..