AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: మెగా వేలంలో వద్దన్నారు.. కట్‌చేస్తే.. 2026లో రీఎంట్రీ చేస్తా.. తగ్గేదేలే అంటోన్న టీ20 ప్రపంచకప్ సెన్సెషన్

సౌరభ్ నేత్రవల్కర్ 2024 ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసి కూడా IPL 2025 వేలంలో జట్ల దృష్టిని ఆకర్షించలేకపోయాడు. USA క్రికెట్‌కు ప్రాముఖ్యతను తీసుకువచ్చిన నేత్రవల్కర్, ఐపీఎల్ మెగా వేలంలో అన్ సోల్డ్ గా మిగిలినప్పటికి.. దానిని స్ఫూర్తిగా తీసుకుని మరింత బలంగా తిరిగి రావాలని సంకల్పం వ్యక్తం చేశాడు.

IPL 2025: మెగా వేలంలో వద్దన్నారు.. కట్‌చేస్తే.. 2026లో రీఎంట్రీ చేస్తా.. తగ్గేదేలే అంటోన్న టీ20 ప్రపంచకప్ సెన్సెషన్
Saurabh Netravalkar
Narsimha
|

Updated on: Dec 13, 2024 | 12:34 PM

Share

2024 T20 ప్రపంచ కప్‌లో ఆకట్టుకునే ప్రదర్శనలతో మెరుపులు మెరిపించిన భారతీయ మూలాలు కలిగిన USA పేసర్ సౌరభ్ నేత్రవల్కర్, IPL 2025 మెగా వేలంలో అమ్ముడుపోకపోవడం అభిమానులలో ఆశ్చర్యం కలిగించింది. పాకిస్థాన్‌పై సూపర్ ఓవర్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో USAను విజయ తీరాలకు చేర్చిన నేత్రవల్కర్, భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వంటి దిగ్గజ బ్యాటర్లను అవుట్ చేస్తూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే, అతని ఈ గొప్ప ఫామ్ కూడా IPL వేలంలో జట్ల దృష్టిని ఆకర్షించలేకపోయింది.

వేలం తర్వాత తన భావాలను పంచుకుంటూ నేత్రవల్కర్, తుది జాబితాలో చోటు పొందినందుకు సంతోషం వ్యక్తం చేశారు. “నాలోని ఆ చిన్న పిల్లవాడు IPLలో ఆడతానన్న ఆశతో ఉన్నాడు. కానీ ఇది అతి ప్రామాణిక ప్లేయర్ పూల్, అందులో చాలామంది అగ్రశ్రేణి ఆటగాళ్లు కూడా ఎంపిక కాలేకపోయారు. కాబట్టి, నేను దీనిని పూర్తిగా అర్థం చేసుకున్నాను,” అని ఆయన అన్నారు.

33 ఏళ్ల నేత్రవల్కర్ తన ప్రాధమిక దశల్లో భారత U19 జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 2010 U19 ప్రపంచ కప్‌లో ముంబై తరపున దేశీయ క్రికెట్ ఆడిన నేత్రవల్కర్, తర్వాత తన కెరీర్‌ను మలచుకోవడానికి అమెరికా వెళ్లారు. అక్కడ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ అయిన ఒరాకిల్‌లో ఉద్యోగం చేసుకుంటూనే, USA క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా మారారు.

USA తరపున 56 ODIలు, 36 T20Iలు ఆడిన నేత్రవల్కర్, 2024 ప్రపంచ కప్‌లో ఆరు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు తీయడంతో పాటు 6.63 ఎకానమీ రేట్‌తో మెరుగైన ప్రదర్శన చేశాడు. ఈ ప్రదర్శనతోనే ఆయన IPL 2025లో అవకాశం దక్కుతుందని ఆశించాడు. అయితే, రూ. 30 లక్షల బేస్ ప్రైస్ వద్ద కూడా ఒక్క ఫ్రాంచైజీ కూడా అతనిపై ఆశక్తి చూపలేదు.

అయితే, ఈ ఫలితం తనను నిరుత్సాహపరచలేదని నేత్రవల్కర్ స్పష్టం చేస్తూ, తన ప్రయాణాన్ని మరింత బలంగా కొనసాగించేందుకు సంకల్పబద్ధంగా ఉన్నట్లు తెలిపారు. “ఇది నాకు మోటివేషన్‌ ఇచ్చింది. మరింత కష్టపడి పని చేసి, వచ్చే ఏడాది IPL 2026లో తిరిగి గట్టిగా రావడానికి సిద్ధమవుతాను,” అని ఆయన టైమ్స్ అఫ్ ఇండియాతో తన ప్రణాళికలను పంచుకున్నారు.