క్రికెట్‌లోనే కాదు ఆర్జనలోనూ అగ్రస్థానం.. స్మృతి మందాన ఆస్తుల ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!!
Smriti Mandhana Net Worth: టీమిండియా విమెన్ క్రికెటర్లలో 'మిథాలి రాజ్' తర్వాత అంతటి పేరు సంపాదించుకున్న క్రికెటర్ స్మృతి మందాన...
Smriti Mandhana Net Worth: టీమిండియా విమెన్ క్రికెటర్లలో ‘మిథాలి రాజ్’ తర్వాత అంతటి పేరు సంపాదించుకున్న క్రికెటర్ స్మృతి మందాన. అందంతోనే కాదు ఆటతోనూ ఈమె ఎంతోమంది అభిమానులకు చేరువైంది. ముఖ్యంగా యూత్‌కు స్మృతి అంటే చాలా ఇష్టమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న క్రేజ్ అమోఘం. ఇలా మైదానంలోనే కాదు.. బయట కూడా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న స్మృతి మందాన బిజినెస్ విమెన్‌గా తారాస్థాయికి చేరుకున్నారని తెలుస్తోంది. తాజాగా ఆమె చేసుకున్న నైకీ ఒప్పందంతో ఆర్జనలో కూడా టాప్‌కు చేరుకుందట.
ఎలాంటి బ్రాండ్‌కైనా ప్రచారం చేయడానికి స్మృతి మందాన ఏడాది రూ. 50 లక్షల వరకు పారితోషికం తీసుకుంటారని టాక్. ఆ లెక్కన నైకీ ఆమెకు అంతకన్నా ఎక్కువ మొత్తాన్నే ఇస్తున్నట్లు సమాచారం. స్టార్‌డమ్ నెట్‌వర్త్ డాట్ కామ్ అంచనా ప్రకారం 24 ఏళ్ల స్మృతి మందాన ఆస్తుల విలువ అక్షరాల రూ. 22 కోట్లని తెలుస్తోంది. అలాగే బీసీసీఐ నుంచి ఆమెకు ప్రతీ ఏడాది రూ. 50 లక్షల జీతం అందుతుంది. అటు విమెన్స్ బిగ్ బాష్ లీగ్ ద్వారా కూడా స్మృతి మందానకు పెద్ద మొత్తంలోనే సంపాదన వస్తుంది. అటు స్మృతి మందాన తన స్వస్థలంలో “ఎస్.ఎం.18” కేఫ్ నడుపుతోన్న సంగతి తెలిసిందే. ఇక ఎయిర్ ఆప్టిక్స్, హైడ్రా గ్లైడ్, బాటా, రెడ్ బుల్, హీరో మోటార్స్ వంటి బ్రాండ్లకు స్మృతి మందాన ప్రచారం చేస్తోన్న విషయం విదితమే..
Also Read: అర్జున్ టెండూల్కర్ ఆల్‌రౌండ్ షో.. ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లు.. ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించేశాడుగా.!