IPL 2021: ప్రాంచైజీ పేరు మార్చుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్..! ఈ సారైనా అద‌ృష్టం కలిసొచ్చేనా..?

Punjab Kings - Kings XI Punjab: ఐపీఎల్ 2021 సీజన్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. 14 సీజన్‌కు సంబంధించి గురువారం క్రీడాకారుల వేలం పాట కూడా జరగనుంది. ఈ క్రమంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రాంచైజీ పేరు..

IPL 2021: ప్రాంచైజీ పేరు మార్చుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్..! ఈ సారైనా అద‌ృష్టం కలిసొచ్చేనా..?
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 16, 2021 | 2:03 AM

Punjab Kings – Kings XI Punjab: ఐపీఎల్ 2021 సీజన్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. 14 సీజన్‌కు సంబంధించి గురువారం క్రీడాకారుల వేలం పాట కూడా జరగనుంది. ఈ క్రమంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రాంచైజీ పేరు మార్చుకుంది. ఏప్రిల్ రెండో వారంలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 14వ సీజన్‌కు ముందు తన పేరును ‘పంజాబ్ కింగ్స్’గా మార్చుకున్నట్లు తెలుస్తోంది. పేరు మార్పుపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు యాజమాన్యం ఇప్పటికే బీసీసీఐకి తెలియజేసింది. అంతేకాకుండా ‘పంజాబ్ కింగ్స్’ పేరుకు బోర్డు నుంచి అనుమతి కూడా లభించినట్టు సమాచారం. ఈ విషయంపై యాజమాన్యం కానీ, ఫ్రాంచైజీ సిబ్బంది కానీ అధికారికంగా వెల్లడించలేదు.

అయితే.. పేరు మార్పుపై క్రికెట్ వర్గాల్లో ఇప్పటికే చర్చ నడుస్తోంది. మరో రెండు రోజుల్లో ముంబైలో జరగనున్న వేలం పాట అనంతరం పంజాబ్ కింగ్స్ ‘రీ-లాంచ్’ కార్యక్రమం నిర్వహించేందుకు కింగ్స్ యాజమాన్యం సన్నాహాలు చేస్తుందని పలువురు పేర్కొంటున్నారు. అయితే పద్నాలుగో సీజన్‌లో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది చర్చనీయాంశమైంది. కాగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గత ఐపీఎల్‌లో మెరుగ్గానే రాణించి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన జట్లల్లో ఒకటిగా నిలిచి మూడోస్థానంతో సరిపెట్టుకుంది.

Also Read:

క్రికెట్‌లోనే కాదు ఆర్జనలోనూ అగ్రస్థానం.. స్మృతి మందాన ఆస్తుల ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!!

అర్జున్ టెండూల్కర్ ఆల్‌రౌండ్ షో.. ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లు.. ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించేశాడుగా.!