డబ్ల్యూపీఎల్‌లో రిచెస్ట్ క్రికెటర్.. కట్ చేస్తే.. 8 మ్యాచ్‌ల్లో 125 పరుగులతో తుస్సుమనిపించింది..
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్-2023) ప్రారంభమైనప్పుడు.. ఐపీఎల్‌లో పురుషుల జట్టు చేయలేని పనిని రాయల్ ఛాలెంజర్స్..

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్-2023) ప్రారంభమైనప్పుడు.. ఐపీఎల్‌లో పురుషుల జట్టు చేయలేని పనిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు చేస్తుందని అందరూ భావించారు. ఆర్సీబీ వుమెన్స్ టీం టైటిల్ గెలవడం పక్కా అనుకున్నారు. కానీ ఈ జట్టు కూడా ట్రోఫీ గెలవడంలో విఫలమై ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. దీనికి ప్రధాన కారణం కెప్టెన్ స్మృతి మంధానా పేలవమైన ఫామ్. అటు కెప్టెన్సీ.. ఇటు బ్యాటింగ్ ఇలా రెండింటిలోనూ మంధానా పేలవమైన ఆటతీరు కనబరిచింది. మార్చి 21న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వుమెన్స్ జట్టు లీగ్‌లో తమ చివరి మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్ జట్టుతో ఆడింది. ఈ చివరి మ్యాచ్‌లో కూడా మంధానా తన బ్యాట్‌తో తుస్సుమనిపించింది.
ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయింది..
చివరి మ్యాచ్‌లో మంధానా 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 24 పరుగులు చేసింది. టీ20 పరంగా ఈ ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా సాగుతుంది. ఈ సీజన్‌లో మంధానా ప్రదర్శనను పరిశీలిస్తే, గత మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై ఆమె చేసిన అత్యధిక స్కోరు 37. జట్టు తొలి మ్యాచ్‌లోనూ ఆమె పెద్దగా రాణించలేదు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో మంధానా 35 పరుగులు చేసింది. ఈ లీగ్‌లో మొత్తంగా ఎనిమిది మ్యాచ్‌ల్లో మంధానా మొత్తం 125 పరుగులు చేసింది. ఈ సమయంలో, ఆమె సగటు 17.85 కాగా.. ఇందులో 19 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ లీగ్‌లో స్మృతి మంధానా అత్యంత ఖరీదైన ప్లేయర్.. ఆర్సీబీ రూ. 3.40 కోట్లతో ఆమెను దక్కించుకున్న సంగతి తెలిసిందే.
కెప్టెన్సీ ఒత్తిడిలో ఆట.?
మంధానా ప్రస్తుతం భారత మహిళల క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్. WPLకి ముందు దక్షిణాఫ్రికాలో ఆడిన ICC మహిళల T20 ప్రపంచకప్‌లో ఆమె అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఐర్లాండ్‌పై 87, ఇంగ్లాండ్‌పై 52 పరుగులు నమోదు చేసింది. కానీ ఈ లీగ్‌లో మాత్రం రాణించలేకపోయింది. కెప్టెన్సీ ఒత్తిడిని తట్టుకోలేకపోవడమే దీనికి కారణం. కెప్టెన్సీ కారణంగా క్రికెట్‌లో చాలా మంది ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శన చేయలేకపోతున్నారని మనం చాలా సందర్భాల్లో చూసే ఉన్నాం. బహుశా మంధానా విషయంలో కూడా ఇదే కావచ్చు.