
Pakistan Vs Sri Lanka: 342 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ కేవలం 4 వికెట్లు కోల్పోయి సాధించింది. ఇందులో 160 పరుగులతో అజేయ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న యువ బ్యాట్స్‌మెన్ అబ్దుల్లా షఫీక్ పాక్ విజయంలో హీరోగా నిలిచాడు. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో పాకిస్థాన్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. 342 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు అద్భుతమైన ఆరంభం లభించింది.అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్ జోడీ తొలి వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అయితే 104 పరుగుల స్కోరు వద్ద అజహర్ అలీని పెవిలియన్‌కు పంపడం ద్వారా శ్రీలంక ఈ మ్యాచ్‌లో పునరాగమనం చేసేందుకు ప్రయత్నించింది. అయితే అబ్దుల్లా షఫీక్‌తో కలిసి బాబర్ ఆజం పాక్‌ను ముందుకు తీసుకెళ్లాడు.
తన టెస్టు కెరీర్‌లో 11వ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ రెండో సెంచరీని నమోదు చేశాడు. బాబర్ ఆజం కూడా 55 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడి పాకిస్థాన్‌ను విజయం వైపు నడిపించాడు.
చరిత్ర సృష్టించిన పాక్ జట్టు..
షఫీక్ ఒక ఎండ్‌లో దృఢంగా ఉండి 160 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. బాబర్ అవుట్ అయిన తర్వాత, రిజ్వాన్ షఫీక్‌కు మద్దతు ఇచ్చాడు. రిజ్వాన్ 40 పరుగులతో ఆకట్టుకున్నాడు. చివర్లో నవాజ్‌తో కలిసి షఫీక్ 6 వికెట్ల తేడాతో పాక్‌కు విజయాన్ని అందించాడు.
Heading towards a thrilling finish in Galle! ?
Abdullah Shafique’s career-best 139* is driving Pakistan’s chase ?#SLvPAK | #BackTheBoysInGreen https://t.co/QelkZC8Ada pic.twitter.com/FUDCNpY9xB
— Pakistan Cricket (@TheRealPCB) July 20, 2022
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ కూడా రాణించలేక పోవడంతో 218 పరుగులకే ఆలౌటైంది. అయితే శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో రాణించి పాకిస్థాన్ ముందు 342 పరుగుల కష్టమైన సవాలును ఉంచింది. కానీ, గాలే మైదానంలో పాక్ జట్టు నాలుగో ఇన్నింగ్స్‌లో అతిపెద్ద లక్ష్యాన్ని సాధించి చరిత్ర సృష్టించింది.