Video: క్రికెట్‌లో కొత్త అర్జునుడు..! పిట్టను కాదు.. దాని కన్ను చూసి కొట్టినట్టు కొట్టాడు! గిల్‌ గిల్లలు ఎగరేశాడు..

ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో కరుణ్ నాయర్ అద్భుతమైన రనౌట్ చేశాడు. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను కరుణ్ నాయర్ సూపర్ త్రోతో ఔట్ చేయడం హైలైట్. ఢిల్లీ 203 పరుగులు చేసింది. గుజరాత్ 14 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది.

Video: క్రికెట్‌లో కొత్త అర్జునుడు..! పిట్టను కాదు.. దాని కన్ను చూసి కొట్టినట్టు కొట్టాడు! గిల్‌ గిల్లలు ఎగరేశాడు..
Gill Run Out

Updated on: Apr 19, 2025 | 7:35 PM

ఐపీఎల్‌ 2025లో భాగంగా శనివారం అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ మొదలైంది. ఈ మ్యాచ్‌లో ఓ సూపర్‌ రనౌట్‌ చోటు చేసుకుంది. అది కూడా గుజరాత్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ది. అతన్ని రనౌట్‌ చేసింది మరెవరో కాదు.. ఇండియాస్‌ అన్‌సంగ్‌ హీరో కరుణ్‌ నాయర్‌. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.

ఈ భారీ స్కోర్‌ను ఛేజ్‌ చేసేందుకు బరిలోకి దిగిన గుజరాత్‌కు కరుణ్‌ నాయర్‌ ఆరంభంలోనే గట్టి షాక్‌ ఇచ్చాడు. ఆ జట్టు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ను సూపర్‌గా రనౌట్‌ చేశాడు. కరుణ్‌ నాయర్‌ అద్భుతమైన త్రోకు కేవలం 7 పరుగులు మాత్రమే చేసిన గిల్‌.. చేసేదేం లేక పెవిలియన్‌కు వెళ్లాల్సి వచ్చింది. కరుణ్‌ నాయర్‌ త్రోకు గుజరాత్‌ టైటాన్స్‌ కేవలం 14 పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయింది. కాగా ఈ మ్యాచ్‌లో నాయర్‌ 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 31 పరుగులు చేసి అదరగొట్టాడు.

ఆ తర్వాత ఈ సూపర్‌ మ్యాన్‌ త్రోతో ఆకట్టుకున్నాడు. ఈ త్రో వీడియో చూసిన క్రికెట్‌ అభిమానులు.. భారతంలో అర్జునుడు చెట్టుపై పిట్ట కాదు.. పిట్ట కన్ను కనిపిస్తుందని, దాన్ని బాణంతో గురి పెట్టి కొట్టినట్లు.. కరుణ్‌ నాయర్‌ తన యాంగిల్‌ నుంచి సింగిల్‌ స్టంప్‌ మాత్రమే కనిపిస్తున్నా.. అద్భుతమైన డైరెక్ట్‌ హిట్‌తో వికెట్‌ను గిరాటేశాడని మెచ్చుకుంటున్నారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..