IND vs ENG: ఒక్క మాటతో కెప్టెన్‌గా వంద మెట్లు ఎక్కేసిన గిల్..! విజయం తర్వాత అతని పేరు ప్రస్తావిస్తూ..
శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో టీమిండియా ఇంగ్లాండ్‌పై గొప్ప విజయం సాధించింది. ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి టెస్టు విజయంతో గిల్ చరిత్ర సృష్టించాడు. తన డబుల్ సెంచరీతో పాటు, బౌలర్ల ప్రదర్శనను కూడా గిల్ ప్రశంసించాడు. ముఖ్యంగా, ప్రసిద్ధ్ కృష్ణకు ప్రోత్సాహం ఇవ్వడం గిల్ పరిణతిని చూపిస్తుంది.

ఇంగ్లాండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించిన తర్వాత కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇప్పటి వరకు విజయం అనేది లేని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో టీమిండియాకు తొలి విజయం అందించిన కెప్టెన్‌గా గిల్ చరిత్ర సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో మొత్తంగా ఒక్క మ్యాచ్‌లనే 430 పరుగులు చేసి.. ఒక టెస్టులో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచంలోనే రెండో ప్లేయర్‌గా నిలిచాడు. ఇంత సాధించినా కూడా.. శుబ్‌మన్ గిల్‌ను ఒక మాట ఒకే ఒక్క మాట కెప్టెన్‌గా వంద మెట్లు పైకి ఎక్కించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత గిల్ మాట్లాడుతూ.. తన విజయానికి కారణమైన అంశాల గురించి వివరించాడు.
తొలి టెస్టుల ఓటమి తర్వాత తాము చర్చించుకున్న విషయాలను.. రెండో టెస్టులో కచ్చితంగా అమలు పరిచామని, అలాగే తమ ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని, ఇలాంటి వికెట్‌పై అలాంటి బౌలింగ్ అద్భుతమన్నాడు. ఇద్దరు(సిరాజ్, ఆకాశ్ దీప్) సూపర్ బౌలింగ్ చేశారని అన్నాడు. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ పెద్దగా వికెట్లు తీసుకోకపోయినా.. అతను కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడని ప్రశంసించాడు. ఈ ఒక్క మటతోనే గిల్ కెప్టెన్‌గా తన పరిణతిని ప్రదర్శించాడు. నిజానికి గిల్ తన స్పీచ్‌లో సిరాజ్, ఆకాశ్ దీప్ పేర్లు డైరెక్టుగా ప్రస్తావించలేదు. ఆ ఇద్దరు అన్నాడు. కానీ, ఈ మ్యాచ్‌లో బౌలింగ్ బాగా వీక్‌గా కనిపించిన ప్రసిద్ధ్ కృష్ణ పేరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. అతను వికెట్లు తీయకపోయినా బాగా బౌలింగ్ చేశాడని అతనికి అండగా నిలిచాడు.
ఈ మ్యాచ్ గెలిచిన సంతోషం అందరిలో ఉన్నా.. ఒక బౌలర్‌గా ఈ మ్యాచ్ ప్రసిద్ధ్ కృష్ణ ఒక పీడ కల. అందుకే ఆ బౌలర్ కాన్ఫిడెన్స్ తగ్గిపోకుండా, అతను నిరాశలో కూరుకుపోకుండా.. ఒక కెప్టెన్‌గా అతని ఆత్మవిశ్వాస్వాన్ని సజీవంగా ఉంచేందుకు మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్, ఆకాశ్ దీప్, తన పేరు కాకుండా ప్రసిద్ధ్ కృష్ణ పేరు ప్రస్తావించి.. అతనికి మోరల్ సపోర్ట్ అందించాడు. బాగా ఆడిన వారి గురించి పెద్దగా చెప్పకపోయినా ఏం పర్లేదు. కానీ నిరాశలో ఉన్న ప్లేయర్ ఇలాంటి సపోర్ట్ అది కూడా కెప్టెన్ నుంచి వస్తే అది ఎంతో బూస్ట్ ఇస్తుంది. ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో బుమ్రా లేకపోయినా.. సిరాజ్ ఆకాశ్ దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇక వాళ్లకు తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ కూడా చెలరేగితే.. ఇక టీమిండియా బౌలింగ్ ఎటాక్‌కు అడ్డే ఉండదు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి