AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shreyas Iyer: వెస్టిండీస్ వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం.. అసలు కారణం బయటపెట్టిన బీసీసీఐ

Shreyas Iyer: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం కానున్నాడు. ఆసియా క్రీడలు 2026లో భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక కావడమే ఇందుకు కారణం. జపాన్‌లో సెప్టెంబర్ 28 నుంచి జరిగే క్రికెట్ టోర్నీలో అయ్యర్ టీమిండియాను నడిపించనున్నాడు. అక్టోబర్ 3న ఆసియా గేమ్స్ ఫైనల్, భారత్-వెస్టిండీస్ మూడో వన్డే ఒకే రోజు జరగనున్నాయి.

Shreyas Iyer: వెస్టిండీస్ వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం.. అసలు కారణం బయటపెట్టిన బీసీసీఐ
Shreyas Iyer
Rakesh
|

Updated on: Sep 09, 2026 | 9:43 AM

Share

Shreyas Iyer: భారత క్రికెట్‌లో అరుదైన సన్నివేశం ఆవిష్కృతం కాబోతోంది. అక్టోబర్ నెలలో ఒకేసారి రెండు వేర్వేరు దేశాల్లో భారత జట్లు మ్యాచ్‌లు ఆడనున్నాయి. జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల్లో టీమిండియాను కెప్టెన్‌గా నడిపించనున్నందుకే, వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరమవుతున్నాడు.

ఆసియా క్రీడలు 2026లో పురుషుల క్రికెట్ టోర్నమెంట్ సెప్టెంబర్ 28న క్వార్టర్ ఫైనల్స్‌తో ప్రారంభం కానుంది. జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా అక్టోబర్ 1న సెమీఫైనల్స్, అక్టోబర్ 3న గోల్డ్ మెడల్ కోసం పోరు జరగనున్నాయి. అదే రోజున భారత్, వెస్టిండీస్ మధ్య మూడో వన్డే మ్యాచ్ న్యూ ఛండీగఢ్‌లో జరగనుంది. భారత్ గనుక ఫైనల్ చేరితే, ఒకే రోజు రెండు వేర్వేరు దేశాల్లో టీమిండియా జట్లు మైదానంలోకి దిగడం ఖాయంగా మారింది. ఈ ఆసియా గేమ్స్ మ్యాచ్‌లు టీ20 ఫార్మాట్‌లో జరగనున్నాయి.

సెప్టెంబర్ 22 నాటికే భారత పురుషుల జట్టు జపాన్ చేరుకోనుంది. అక్కడ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఆతిథ్య జపాన్‌తో మొదటి మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ, ఆసియా గేమ్స్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక కావడం వల్ల విండీస్ వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదు. అక్టోబర్ 2025లో వన్డే వైస్ కెప్టెన్‌గా సెలక్ట్ అయిన అయ్యర్, దేశానికి గోల్డ్ మెడల్ అందించేందుకే ఆసియా క్రీడల వైపు అడుగులు వేశాడు.

భారత ఆసియా క్రీడల బృందానికి బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాకారుల కఠిన శ్రమ, సన్నాహాలు, పట్టుదల చూస్తుంటే దేశానికి పసిడి పతకాలు ఖాయంగా కనిపిస్తున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం క్రికెట్ జట్లే కాకుండా ఆసియా గేమ్స్‌లో పాల్గొంటున్న భారత అథ్లెట్లందరికీ దేశప్రజల మద్దతు లభిస్తుందని, క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఆసియా గేమ్స్ 2026కు భారత జట్టు వివరాలు

జపాన్‌లో జరిగే ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం బీసీసీఐ అత్యంత బలమైన జట్టును ఎంపిక చేసింది. యంగ్ స్టార్స్, సీనియర్ల కలయికతో ఈ స్క్వాడ్ రూపుదిద్దుకుంది.

భారత జట్టు: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, శివమ్ దూబె, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, సంజూ శామ్సన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us