నిన్న జట్టులో చోటు పాయే.. నేడు వన్డే కెప్టెన్సీ ఛాన్స్ మిస్సాయే.. ఒక్కరోజులోనే ఊహించని ట్విస్ట్
Indian Crikcet Team: అయ్యర్‌ను కెప్టెన్‌గా చేస్తారనే ఊహాగానాల మధ్య, రోహిత్ స్థానంలో వేరొకరిని ఎంపిక చేయడంపై చర్చలు జరిగాయని వచ్చిన అన్ని వాదనలను BCCI కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా ఖండించారు. దీంతో శ్రేయాస్ అయ్యర్‌కు మరోసారి ఊహించని షాక్ తగిలినట్లు అయింది.

Indian Cricket Team: ఆసియా కప్ జట్టు ఎంపిక తర్వాత, భారత బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ గురించి చర్చలు మొదలయ్యాయి. అతన్ని టీ20 జట్టులో చేర్చలేదు. దీంతో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వస్తున్నాయి. జట్టు ఎంపిక జరిగిన రెండు రోజుల తర్వాత, బీసీసీఐ శ్రేయాస్‌ను వన్డే కెప్టెన్‌గా పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. రోహిత్ శర్మ తర్వాత, అతను 50 ఓవర్ల ఆటలో బాధ్యతలు స్వీకరించవచ్చు అని తెలుస్తోంది.
అయ్యర్‌ను కెప్టెన్‌గా చేస్తారనే ఊహాగానాల మధ్య, రోహిత్ స్థానంలో వేరొకరిని ఎంపిక చేయడంపై చర్చలు జరిగాయని వచ్చిన అన్ని వాదనలను BCCI కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా ఖండించారు. హిందూస్తాన్ టైమ్స్‌కు ఒక ప్రకటనలో, సైకియా మాట్లాడుతూ, “ఇది నాకు వార్త. అలాంటి చర్చ జరగలేదు” అంటూ చెప్పుకొచ్చాడు. రోహిత్ వయసు 38 సంవత్సరాలు, టెస్టులు, టీ20ల నుంచి రిటైర్ అయ్యాడు. 2027 వన్డే ప్రపంచ కప్ నాటికి అతనికి 40 సంవత్సరాలు నిండుతాయి. ఇటువంటి పరిస్థితిలో వన్డే ప్రపంచ కప్ కోసం బోర్డు ఒక యువ ఆటగాడికి కమాండ్‌ను అప్పగించవచ్చు అని తుస్లోంది.
అయ్యర్ రేసులో వెనుకంజే..
గత వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలలో అయ్యర్ అద్భుతంగా రాణించాడు. అయినప్పటికీ, కెప్టెన్సీ రేసులో అతను చాలా వెనుకబడి ఉన్నాడని భావిస్తున్నారు. జట్టులో అతని స్థానం నిర్ధారించబడింది. కానీ, అతన్ని కెప్టెన్‌గా నియమించడంపై ఇప్పటికీ సందేహం ఉంది. ప్రస్తుతం గిల్‌కు టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు. అతను టీ20లో వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యాడు. అతను ఇప్పటికే వన్డేలకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతను మూడు ఫార్మాట్లలోనూ జట్టుకు కెప్టెన్‌గా మారే అవకాశం ఎక్కువగా ఉంది.
వన్డేల్లో గిల్ మొదటి ఎంపిక..
వన్డే కెప్టెన్సీకి కూడా ప్రస్తుత భారత టెస్ట్ కెప్టెన్ సహజ ఎంపిక అని నివేదికలు వెల్లడిస్తున్నాయి. “వన్డే క్రికెట్‌లో అతని సగటు 59. అతను ఇప్పటికే జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు” అని ఆ నివేదిక వెల్లడిస్తోంది.
గిల్ అయ్యర్ కంటే తక్కువ అనుభవం..
ఐపీఎల్‌లో చాలా కాలం కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం అయ్యర్‌కు ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు. అనుభవంలో గిల్ అతని కంటే చాలా వెనుకబడి ఉన్నాడు. కానీ, సెలెక్టర్లు మొదట ఎంపిక చేసేవాడు. రోహిత్ శర్మ తర్వాత బీసీసీఐ వన్డేల్లో ఎవరిని కెప్టెన్‌గా చేస్తుందో ఇప్పుడు చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








