Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ హెల్త్ అప్డేట్.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్.. స్వదేశానికి ఎప్పుడు వస్తారంటే?
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడి ఆసుపత్రిలో చేరిన భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అభిమానులకు గుడ్ న్యూస్. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో క్యాచ్ పట్టినప్పుడు కింద పడటంతో అయ్యర్‌కు ప్లీహం వద్ద తీవ్ర గాయమైంది.

Shreyas Iyer : ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడి ఆసుపత్రిలో చేరిన భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అభిమానులకు గుడ్ న్యూస్. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో క్యాచ్ పట్టినప్పుడు కింద పడటంతో అయ్యర్‌కు ప్లీహం వద్ద తీవ్ర గాయమైంది. దీని కారణంగా ఆయన సిడ్నీలోని ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
భారత క్రికెట్ జట్టు ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో గాయపడ్డారు. మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కారీ క్యాచ్ పట్టే క్రమంలో ఆయన కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో అయ్యర్‌కు పొత్తికడుపు వద్ద తీవ్ర గాయమై, ముఖ్యంగా ప్లీహం వద్ద దెబ్బ తగిలింది. దీని కారణంగా అంతర్గత రక్తస్రావం మొదలైంది.
గాయం తీవ్రతను గుర్తించిన వైద్య బృందం వెంటనే అయ్యర్‌ను ఆసుపత్రికి తరలించి ఐసీయూలో ఉంచి చికిత్స అందించింది. ఈ సంఘటన అక్టోబర్ 25, 2025న జరిగింది. అయ్యర్ ఆరోగ్యంపై స్పందించిన బీసీసీఐ తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. అయ్యర్‌కు జరిగిన అంతర్గత రక్తస్రావాన్ని వెంటనే ఆపడానికి ఒక చిన్నపాటి ఆపరేషన్ నిర్వహించారు. దీనివల్ల రక్తస్రావం త్వరగా ఆగిపోయిందని బీసీసీఐ తెలిపింది.
బీసీసీఐ మెడికల్ టీం సిడ్నీ భారతదేశంలోని డాక్టర్ల సహకారంతో చికిత్స అందించింది. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ఆయన వేగంగా కోలుకుంటున్నందుకు సంతోషంగా ఉందని బీసీసీఐ ప్రకటించింది. అందుకే ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటికీ, శ్రేయస్ అయ్యర్ వెంటనే స్వదేశానికి తిరిగి రావడం లేదు. బీసీసీఐ ప్రకటన ప్రకారం.. అయ్యర్ వైద్యపరమైన పర్యవేక్షణ కోసం మరికొన్ని రోజులు సిడ్నీలోనే ఉండవలసి ఉంటుంది. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు, విమాన ప్రయాణానికి ఫిట్‌గా ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాతే ఆయన భారత్‌కు తిరిగి వస్తారు. అంటే పూర్తిగా కోలుకునేంత వరకు ఆయన ఆస్ట్రేలియాలోనే ఉండి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




