Video: నన్ను అడగాలంటూ ఫైరయ్యాడు.. కట్ చేస్తే.. థర్డ్ అంపైర్ నిర్ణయంతో సెల్యూట్ చేసిన అయ్యర్
ఐపీఎల్ 2025లో SRHతో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ తన సహచరులపై అసహనం వ్యక్తం చేసిన ఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. డీఆర్‌ఎస్ విషయంలో తనను సంప్రదించకపోవడంతో అతను ఆగ్రహంతో “పెహ్లే మెరే సే పూఛ్‌నా” అంటూ చెప్పడం గమనార్హం. మరోవైపు, స్టోయినిస్ నాలుగు సిక్సర్లు బాది షమీ వేసిన ఓవర్‌ను చిత్తు చేశాడు. షమీ 4 ఓవర్లలో 75 పరుగులు ఇచ్చి రెండవ చెత్త స్పెల్ రికార్డు సాధించాడు.

ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన జట్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన దృశ్యం అభిమానులను ఆశ్చర్యపరిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. మ్యాచు సమయంలో, నాల్గో ఓవర్ రెండో బంతిని గ్లెన్ మాక్స్‌వెల్ డౌన్ ద లెగ్‌సైడ్ బౌల్ చేయగా, అంపైర్ వైడ్‌గా ప్రకటించాడు. కానీ మాక్స్‌వెల్‌తో పాటు వికెట్ కీపర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కూడా ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను సంప్రదించకుండా డీఆర్‌ఎస్ కోసం సిగ్నల్ ఇచ్చారు. ఇది అయ్యర్‌కు మింగుడుపడలేదు. కెప్టెన్‌గా తానున్నందున ముందు తనను అడగకుండా రివ్యూ తీసుకున్నందుకు అతను ఆగ్రహంతో స్పందించాడు. ఆయన “పెహ్లే మెరేసే పుచ్ నా (ముందు నన్నే అడగాలి)” అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక సమయంలో అయ్యర్ తన క్యాప్‌ను నేలకేసి కొట్టబోయి, చివరకు తాను నియంత్రించుకున్న సందర్భమూ ఫుటేజ్‌లో కనిపించింది.
ఈ మ్యాచ్‌లో మరో విభిన్న సంఘటన కూడా చోటు చేసుకుంది. ట్రావిస్ హెడ్‌కు ఇచ్చిన క్యాచ్‌ను యుజ్వేంద్ర చాహల్ పట్టే ప్రయత్నం చేయకపోవడంపై కూడా అయ్యర్ అసహనం వ్యక్తం చేశాడు. తన సహచరుల నిర్లక్ష్యంపై అయ్యర్ కొంత అసంతృప్తిగా కనిపించాడు. ఆ సమయంలో మాక్స్‌వెల్ రివ్యూకు పట్టుబడగా, అయ్యర్ గట్టిగా స్పందించినా చివరికి రివ్యూకు అంగీకరించాడు. అయితే ట్రావిస్ హెడ్ నాటౌట్‌గా మిగిలిపోయాడు, దీనితో శ్రేయస్ అంచనాలు ఫలించలేదు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేస్తూ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడి 36 బంతుల్లో 82 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ జట్టుకు స్థిరతనిచ్చింది. అయితే మ్యాచ్ ముగింపు అసలు హైలైట్‌గా నిలిచింది. ఈ సీజన్‌లో బ్యాటుతో మెరిసేందుకు ఇబ్బంది పడుతున్న మార్కస్ స్టోయినిస్ చివరి ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదుతూ 11 బంతుల్లో 34 పరుగులు చేసి జట్టును భారీ స్కోరు వద్ద నిలిపాడు.
ఇంకా ఈ మ్యాచ్‌లో భారత పేసర్ మొహమ్మద్ షమీకు మరపురాని రాత్రిగా మిగిలింది. స్టోయినిస్ దాడికి షమీ నిలువలేకపోయాడు. అతను వేసిన చివరి ఓవర్‌లో ఏకంగా 27 పరుగులు వచ్చాయి. మొత్తంగా షమీ 4 ఓవర్లలో 75 పరుగులు ఇచ్చి వికెట్ లేకుండా మిగిలాడు, ఇది ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యంత ఖరీదైన స్పెల్‌గా నమోదు అయింది. మొదటి ఓవర్ నుంచే PBKS ఆక్రమణాత్మకంగా ఆడింది. వికెట్ కీపర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ షమీ బౌలింగ్‌లో వరుస బౌండరీలు బాది మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అతను సీనియర్ బౌలర్‌ను నిర్లక్షించి, ఆత్మవిశ్వాసంతో షాట్‌లు ఆడి శుభారంభం అందించాడు.
Shreyas Iyer's angry reaction over DRS call. pic.twitter.com/huZBhbDn4F
— CricAsh (@ash_cric) April 12, 2025
Maxwell taking DRS without Asking Shreyas Iyer Warra Respect for Idli in PBKS 😭 #SRHvsPBKSpic.twitter.com/8x3M85bidX
— 𝘼𝙛💤𝙖𝙡 (@AzzyAsimFan) April 12, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..