Shreyas Iyer: లక్ష్మణ్, గంగూలీ బాటలోనే.. ఇంగ్లాండ్ కౌంటీల్లోకి శ్రేయాస్ అయ్యర్..

Shreyas Iyer: టీమిండియా యువ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ ఇంగ్లాండ్ కౌంటీలలోకి అడుగుపెట్టబోతున్నాడు. రాయల్ లండన్ కప్ 2021 టోర్నమెంట్‌లో..

Shreyas Iyer: లక్ష్మణ్, గంగూలీ బాటలోనే.. ఇంగ్లాండ్ కౌంటీల్లోకి శ్రేయాస్ అయ్యర్..
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 23, 2021 | 1:52 PM

Shreyas Iyer: టీమిండియా యువ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ ఇంగ్లాండ్ కౌంటీలలోకి అడుగుపెట్టబోతున్నాడు. రాయల్ లండన్ కప్ 2021 టోర్నమెంట్‌లో లాంకషైర్‌ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించనున్నాడు. గతంలో ఈ జట్టు తరపున టీమిండియా దిగ్గజ ఆటగాళ్లైన ఫరోఖ్ ఇంజనీర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, మురళి కార్తీక్, దినేష్ మోంగియాలు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.

జూలై 22 నుంచి ఆగష్టు 19 వరకు రాయల్ లండన్ కప్ 2021 టోర్నమెంట్ జరగనుంది. ఈ నేపధ్యంలోనే శ్రేయాస్ అయ్యర్ జూలై 15న లాంకషైర్‌ జట్టుతో చేరనున్నాడు. నెల రోజుల పాటు గ్రూప్ దశలో జరిగే మ్యాచ్‌లన్నింటికి అతడు అందుబాటులో ఉంటాడు. కాగా, శ్రేయాస్ అయ్యర్ జట్టులోకి చేరబోతున్నట్లు లాంకషైర్‌ క్రికెట్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అటు ఇవాళ్టి నుంచి ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌లో మిడిల్ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగనున్న శ్రేయాస్ అయ్యర్.. టీమిండియాకు ఎంతో కీలకం కానున్నాడు.

Also Read:

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హోళీ పండుగ గిఫ్ట్‌గా రూ. 10 వేలు.. వివరాలివే.!

జనసైనికుల స్ట్రాంగ్ వార్నింగ్.. రాపాకకు నో ఎంట్రీ బోర్డు.. వైరల్ అవుతున్న పిక్.!

బంగారం కొనాలనుకుంటున్నారా?.. అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే.. ఇవాళ ఏకంగా…