
IPL 2022: వెస్టిండీస్ స్టార్ ఆటగాడు షిమ్రన్ హెట్‌మైర్ (Shimron Hetmyer) తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతని సతీమణి నిర్వాని పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఐపీఎల్-2022లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతను టోర్నీ మధ్యలోనే జట్టును వీడాడు. తన స్వస్థలమైన గయానాకు వెళ్లిపోయాడు. కాగా మొదటిసారి తండ్రైన హెట్‌మైర్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఈ సందర్భంగా తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. ‘ఈ ప్రపంచంలోకి స్వాగతం. చాలా ఆనందంగా ఉంది. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. ఐలవ్యూ’ అంటూ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశాడు. ఇందులో హెట్‌మైర్ తన బిడ్డను చేతుల్లోకి తీసుకుని తదేకంగా చూస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా ఐపీఎల్ 2022 మెగా వేలంలో షిమ్రన్ హెట్‌మైర్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 8.5 కోట్లకు కొనుగోలు చేసింది. అందుకు తగ్గట్లే అద్భుతంగా రాణిస్తున్నాడీ స్టార్ ప్లేయర్. ఫినిషర్‌గా జట్టుకు అద్భుత విజయాలు అందిస్తున్నాడు. టోర్నీలో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన హెట్‌మైర్ 72.75 సగటుతో 291 పరుగులు చేశాడు. ఇక రాజస్థాన్ విషయానికొస్తే.. ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో ఆ జట్టు మూడో స్థానంలో ఉంది. కాగా త్వరలోనే రాజస్థాన్ జట్టులోకి హెట్ మైర్ చేరనున్నాడు.
Many congratulations to Shimron Hetmyer on becoming a father. pic.twitter.com/BwoLpsNcbs
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: