ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌.. కట్‌చేస్తే.. అంపైర్ ఫిర్యాదుతో నిషేధం ముప్పు.. ఎందుకంటే?

Shakib Al Hasan Bowling Action: రెండు టెస్టుల సిరీస్ కోసం షకీబ్ అల్ హసన్ సెప్టెంబర్‌లో భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే, భారత పర్యటనకు ముందు, అతను 9 వికెట్లు తీసిన మ్యాచ్‌లో ఓ వివాదం నెలకొంది. షకీబ్ బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు రావడంతో.. బంగ్లా క్రికెట్‌లో గందరగోళం నెలకొంది.

ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌.. కట్‌చేస్తే.. అంపైర్ ఫిర్యాదుతో నిషేధం ముప్పు.. ఎందుకంటే?
Shakib Al Hasan Bowling Action
Follow us
Venkata Chari

|

Updated on: Nov 05, 2024 | 7:17 PM

Shakib Al Hasan Bowling Action: తన చివరి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని అవుట్ చేసిన బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ కష్టాల్లో పడ్డాడు. అతని బౌలింగ్ యాక్షన్ అనుమానాస్పదంగా కనిపించిందంట. దీనిపై అంపైర్ ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు అతని బౌలింగ్ యాక్షన్‌పై దర్యాప్తు చేయవలసిందిగా ఆదేశించారు. సెప్టెంబరులో రెండు టెస్టుల సిరీస్ కోసం షకీబ్ భారత పర్యటనకు వచ్చాడు. సెప్టెంబర్ 19, 27 మధ్య చెన్నై, కాన్పూర్‌లలో రెండు టెస్టులు ఆడిన సంగతి తెలిసిందే. కాన్పూర్ టెస్టులో షకీబ్ నాలుగు వికెట్లు తీశాడు. ఇందులో అతను కోహ్లి, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, ఆర్ అశ్విన్‌ల వికెట్లు పడగొట్టాడు. కోహ్లీ, అశ్విన్‌లను బౌల్డ్ చేశాడు.

భారత పర్యటనలో తన బౌలింగ్‌తో విధ్వంసం సృష్టించడానికి కేవలం 10 రోజుల ముందు, అతను కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ వన్ మ్యాచ్‌లో సత్తా చాటాడు. సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లీష్ కౌంటీ జట్టు సర్రే తరపున ఆడాడు. అక్కడ అతను 9 వికెట్లు పడగొట్టాడు. ఆ మ్యాచ్ తర్వాత, అంపైర్లు స్టీవ్ ఓ షాగ్నెస్సీ, డేవిడ్ మిల్లిన్స్ అతని బౌలింగ్ యాక్షన్ గురించి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అతని బౌలింగ్ యాక్షన్‌పై దర్యాప్తు చేయమని కోరింది.

13 ఏళ్ల తర్వాత కౌంటీ ఆడిన షకీబ్..

37 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షకీబ్ దాదాపు 13 ఏళ్ల తర్వాత కౌంటీకి ఆడేందుకు మైదానంలోకి వచ్చాడు. కేవలం ఒక మ్యాచ్ తర్వాత అతనికి ఇబ్బంది ఎదురైంది. అంతకుముందు 2010-11లో వోర్సెస్టర్‌షైర్‌ తరపున ఆడాడు. క్రిక్‌ఇన్‌ఫో ప్రకారం, షకీబ్‌ను ఆడకుండా నిషేధించలేదు. అయితే, అతనిని విచారణ చేయవలసిందిగా కోరింది. నివేదికల ప్రకారం, అతని బౌలింగ్ యాక్షన్‌పై మొదటిసారి ప్రశ్నలు తలెత్తాయి. నివేదిక ప్రకారం, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారి మాట్లాడుతూ- షకీబ్ అనుమానాస్పద బౌలింగ్ చర్య అంతర్జాతీయ క్రికెట్‌కు సంబంధించినది కాదు లేదా ఇతర దేశాల దేశీయ క్రికెట్‌తో సంబంధం లేదు. ఇది ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన విషయం అంటూ చెప్పుకొచ్చాడు.

షకీబ్ అంతర్జాతీయ కెరీర్ కూడా చివరి దశలో ఉంది. టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్ నుంచి రిటైరయ్యాడు. టెస్ట్ గురించి మాట్లాడితే, అతను తన స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తన వీడ్కోలు మ్యాచ్ ఆడాలనుకున్నాడు. అయితే, ఇటీవల బంగ్లాదేశ్‌లో రాజకీయ గందరగోళం కారణంగా, భద్రతా కారణాల వల్ల షకీబ్ తన దేశానికి వెళ్లలేకపోయాడు. అతను తన చివరి టెస్టును భారత్‌లోనే ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డే ఫార్మాట్‌కు కూడా గుడ్‌బై చెప్పనున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ