ముంబై టీంను వీడాడు.. కట్‌చేస్తే.. 9 మ్యాచ్‌ల్లో 2 డబుల్ సెంచరీలతోపాటు 8 సెంచరీలు బాదిన 12th ఫెయిల్ డైరెక్టర్ కొడుకు
Vidhu Vinod Chopra Son Agni Chopra: అగ్ని ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ప్లేట్ గ్రూప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతను ఐదు ఇన్నింగ్స్‌ల్లో 161.50 సగటుతో 646 పరుగులు చేశాడు. గత సీజన్‌ను పరిశీలిస్తే, అగ్ని 12 ఇన్నింగ్స్‌ల్లో 78.25 సగటుతో 939 పరుగులు చేశాడు. అతని తర్వాత తన్మయ్ అగర్వాల్ ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 95.62 సగటుతో 765 పరుగులు చేశాడు.
Vidhu Vinod Chopra Son Agni Chopra: 2024లో బాక్సాఫీస్ వద్ద 12వ ఫెయిల్ చిత్రం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిని ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత విధు వినోద్ చోప్రా తెరకెక్కించారు. అయితే, రంజీ ట్రోఫీ 2024-25లో ఆయన కుమారుడు అగ్ని చోప్రా అద్భుతాలు చేశాడు. అతను ప్లేట్ గ్రూప్‌లో భాగమైన మిజోరం జట్టులో సభ్యుడిగా ఉన్నాు. ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లలో మూడు సెంచరీలు సాధించాడు. అందులో రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన అతను అప్పటి నుంచి సెంచరీలు బాదుతున్నాడు. అతను తొమ్మిది ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో రెండు డబుల్ సెంచరీలతో సహా ఎనిమిది సెంచరీలు సాధించాడు. అంతేకాదు అతని బ్యాట్ నుంచి నాలుగు హాఫ్ సెంచరీలు కూడా వచ్చాయి. అతను 99.06 సగటుతో మొత్తం 1585 పరుగులు చేశాడు.
జూనియర్ క్రికెట్‌లో ముంబై తరపున అద్భుతాలు..
అగ్ని గత ఏడాది మాత్రమే మిజోరం క్రికెట్ జట్టులో భాగమయ్యాడు. అంతకు ముందు అతను ముంబై తరపున ఆడేవాడు. ఇక్కడ అతను అండర్ 19, అండర్ 23 ముంబై జట్టులో ఆడాడు. అండర్ 23లో కెప్టెన్సీని కూడా నిర్వహించాడు. అతను 2019-20 సీకే నాయుడు ట్రోఫీలో 760 పరుగులతో ముంబయి తరపున అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. అయితే, కోచ్ అభ్యర్థన మేరకు మిజోరంకు షిఫ్ట్ అయ్యాడు. బయటకు వెళ్లడం వల్ల ఆడేందుకు ఎన్నో అవకాశాలు లభిస్తాయని కోచ్ చెప్పాడు. ముంబైలో ఇలా జరగడం కష్టం. అలాగే జూనియర్ స్థాయిలో నిరంతరం పరుగులు చేసినప్పటికీ ముంబై సీనియర్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
మిజోరంకు మారడం గురించి అగ్ని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ, ‘మిజోరం జూలై (2023)లో నేషనల్ క్రికెట్ అకాడమీలో ట్రయల్స్ నిర్వహించింది. నేను ట్రయల్స్‌కి వెళ్లి ఎంపిక కావడం అదృష్టంగా భావిస్తున్నాను. నా నగరాన్ని విడిచిపెట్టడం చాలా కష్టం. కానీ, లిస్ట్ A, ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడేందుకు ఇదే అత్యుత్తమ అవకాశం అంటూ చెప్పుకొచ్చాడు.
మొదటి రంజీ సీజన్‌లో 5 సెంచరీలు..
మిజోరం తరపున అరంగేట్రం చేసిన అగ్ని.. ఇప్పటికే రంజీ సీజన్‌లో వరుసగా నాలుగు సెంచరీలతో సహా మొత్తం ఐదు సెంచరీలు చేశాడు. అయితే, ప్లేట్ గ్రూప్‌లో పరుగులు చేయడం తన కెరీర్‌కు పెద్దగా ప్రయోజనం కలిగించదని కూడా నాకు తెలుసు. అవును, నేను ఐదు సెంచరీలు చేశాను. కానీ, మేం ఎలైట్‌కు అర్హత సాధించకపోతే వాటికి అర్థం లేదు. ఇదే నా లక్ష్యం’ అంటూ చెప్పుకొచ్చాడు.
క్రికెట్‌లో తన కెరీర్‌ను కొనసాగించేందుకు అగ్ని తన తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. అతను శుభ్‌మన్ గిల్ ట్రైనర్ ఖుష్‌ప్రీత్ సింగ్ ఔలాఖ్ వద్దకు చేరాడు. దీని ద్వారా అతను తన కంఫర్ట్ జోన్‌ను తొలగించాలనుకున్నాడు. అలాగే క్రికెట్‌పై పూర్తిగా దృష్టి పెట్టాలనుకున్నాడు. ఔలాఖ్ కోల్‌కతా నైట్ రైడర్స్ అకాడమీలో గిల్‌తో కలిసి పనిచేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..