AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 17 ఏళ్ల తర్వాత ఆఫ్రో ఆసియా కప్.. ఒకే జట్టులో కోహ్లీ, బాబర్?

Afro Asia Cup: ఆఫ్రో ఆసియా కప్ 2005, 2007లో రెండుసార్లు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఆఫ్రో ఆసియా కప్ మరోసారి ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే జరిగితే, పాకిస్తాన్, భారత్ ఆటగాళ్లు కలిసి ఒకే టీంగా బరిలోకి దినున్నారు. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం..

IND vs PAK: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 17 ఏళ్ల తర్వాత ఆఫ్రో ఆసియా కప్.. ఒకే జట్టులో కోహ్లీ, బాబర్?
Afro Asia Cup
Venkata Chari
|

Updated on: Nov 05, 2024 | 8:45 PM

Share

Afro Asia Cup: విరాట్ కోహ్లి, బాబర్ ఆజం, రోహిత్ శర్మ, షాహీన్ అఫ్రిది, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ రిజ్వాన్ రాబోయే కాలంలో కలిసి ఆడుతున్నట్లు కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే, ఎప్పుడో ఆగిపోయిన ఓ సిరీస్ మరలా మొదలుకానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు పొరుగు దేశాల క్రికెటర్లు ఆఫ్రో-ఆసియా కప్‌లో కలిసి ఆడటం చూడొచ్చు. చివరిసారిగా 2007లో జరిగిన ఆఫ్రో-ఆసియా కప్‌ను పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆఫ్రికా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఈ దిశగా చర్యలు చేపట్టింది. దీని AGM నవంబర్ 2న జరిగింది. ఖండాంతర సిరీస్ అవకాశాలను అన్వేషించడానికి ఇతర సంస్థలతో కలిసి పనిచేయడం దీని లక్ష్యం.

ఆఫ్రో ఆసియా కప్ 2005, 2007లో రెండుసార్లు నిర్వహించారు. అయితే, 2005లో దక్షిణాఫ్రికా దీనికి ఆతిథ్యమివ్వగా, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మూడు మ్యాచ్‌లు 2007లో భారతదేశంలో ఆడగా, ఆసియా XI 3-0తో గెలిచింది. 2009లో కెన్యాలో ఈ టోర్నీ జరగాల్సి ఉండగా అది కుదరలేదు. ఇప్పుడు 17 సంవత్సరాల తర్వాత, దీనిపై మళ్లీ చర్చ మొదలైంది. ఈ టోర్నీ జరిగితే భారత్, పాకిస్థాన్ ఆటగాళ్లు కలిసి ఆడడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది.

ఆఫ్రికా క్రికెట్ ఏం చెప్పిందంటే?

ESPNcricinfo నివేదిక మేరకు ACA తాత్కాలిక ఛైర్మన్ తవేగ్వా ముకుహ్లానీ మాట్లాడుతూ, ‘క్రికెట్‌తో పాటు, ఆఫ్రో-ఆసియా కప్ కూడా సంస్థకు చాలా అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. రెండు వైపుల నుంచి చాలా డిమాండ్ ఉంది. మేం ఆసియా క్రికెట్ కౌన్సిల్‌, మా ఆఫ్రికన్ సహోద్యోగులతో కూడా మాట్లాడాం. వారు ఆఫ్రో ఆసియా కప్‌ను పునఃప్రారంభించాలని కోరుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చింది.

ఆఫ్రో-ఆసియా కప్‌లో ఏ భారత్-పాకిస్థాన్ ఆటగాళ్లు ఆడారు?

దీనికి సంబంధించి ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు ఇంకా అధికారిక సందేశం రాలేదని నివేదికలో పేర్కొంది. అలాగే ఇటీవల జరిగిన ఆ సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదు. 2005, 2007లో ఆఫ్రో-ఆసియా కప్ జరిగినప్పుడు, ఆసియా XIలో ఇంజమామ్ ఉల్ హక్, రాహుల్ ద్రవిడ్, ఆశిష్ నెహ్రా, అనిల్ కుంబ్లే, ఎంఎస్ ధోనీ, సౌరవ్ గంగూలీ, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ ఉన్నారు, మహ్మద్ ఆసిఫ్, మహ్మద్ యూసుఫ్, షోయబ్ అక్తర్ భారత్-పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..