
Shai Hope Century: వెస్టిండీస్‌లో జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ 30వ మ్యాచ్‌లో షాయ్ హోప్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో బార్బడోస్ రాయల్స్ జట్టు కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు సయీమ్ అయ్యూబ్ (16), ఒడియన్ స్మిత్ (21) ఆరంభంలోనే వికెట్లను కోల్పోయింది.
3వ ర్యాంక్‌లో బరిలోకి దిగిన షాయ్ హోప్ తుఫాన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆరంభం నుంచి వేగవంతమైన బ్యాటింగ్‌కు ప్రాధాన్యతనిచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ మైదానంలోని ప్రతి మూలకు బంతిని పంపించాు. ఫలితంగా 15 ఓవర్లకు ముందే గయానా అమెజాన్ వారియర్స్ జట్టు స్కోరు 150 పరుగుల మార్కును దాటింది.
రహ్కీమ్ కార్న్‌వాల్ వేసిన 16వ ఓవర్‌లో షాయ్ మైదానంలో మెరుపులు కురిపించాడు. వరుసగా 4, 6, 6, 6, 4, 6 కొట్టాడు. దీంతో ఒకే ఓవర్లో 32 పరుగులు రాబట్టాడు. అంతే కాకుండా కేవలం 41 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి బౌలర్లపై ఊచకోత కోశాడు.
చివరగా 44 బంతులు ఎదుర్కొన్న షాయ్ హోప్ 8 భారీ సిక్సర్లు, 9 ఫోర్లతో 106 పరుగులు చేశాడు. మరోవైపు కెల్వాన్ అండర్సన్ 47 పరుగులతో రాణించాడు. ఫలితంగా గయానా అమెజాన్ వారియర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది.
466646 – Hope gets to century in style!#CPL2023 #CPLonFanCode pic.twitter.com/owKZVm9LJs
— FanCode (@FanCode) September 18, 2023
227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బార్బడోస్ రాయల్స్‌కు గయానా అమెజాన్ వారియర్స్ తొలి షాక్ ఇచ్చింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌కు ఇమ్రాన్ తాహిర్ మార్గం చూపించాడు. దీంతో 50 పరుగులు చేసేలోపే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
అయితే, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రివాల్డో క్లార్క్ 54 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. అయితే, అంతలోనే బార్బడోస్ జట్టును 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 138 పరుగులకు నియంత్రించడంలో సఫలమైంది. ఈ మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ 88 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
గయానా అమెజాన్ వారియర్స్ ప్లేయింగ్ 11: సిమ్ అయూబ్, ఒడియన్ స్మిత్, షాయ్ హోప్, షిమ్రాన్ హెట్మెయర్, ఆజం ఖాన్ (వికెట్ కీపర్), డ్వేన్ ప్రిటోరియస్, కెల్వాన్ అండర్సన్, గుడాకేష్ మోతీ, రోన్స్ ఫోర్డ్ బీటన్, ఇమ్రాన్ తాహిర్ (కెప్టెన్), షమర్ జోసెఫ్.
బార్బడోస్ రాయల్స్ ప్లేయింగ్ 11: రహ్కీమ్ కార్న్‌వాల్, జస్టిన్ గ్రీవ్స్, లారీ ఎవాన్స్, అలిక్ అథానాజే, రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), జాసన్ హోల్డర్, కార్లోస్ బ్రాత్‌వైట్, రివాల్డో క్లార్క్ (వికెట్ కీపర్), ఒబెడ్ మెక్‌కాయ్, అకీమ్ జోర్డాన్, కైస్ అహ్మద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..