10 ఓవర్లలో 10 పరుగులిచ్చి 8 వికెట్లు తీసిన ఘనుడు..! ఐపీఎల్‌లో ఏ టీం తరపున ఆడుతున్నాడో తెలుసా..?
Cricket News:10-4-10-8 ఇది టెన్నిస్ స్కోరు కాదు. ఒక భారత బౌలర్ బౌలింగ్ సంఖ్యలు. అది కూడా 50 ఓవర్ల మ్యాచ్‌లో. ఇప్పుడు ఈ బౌలర్
Cricket News:10-4-10-8 ఇది టెన్నిస్ స్కోరు కాదు. ఒక భారత బౌలర్ బౌలింగ్ సంఖ్యలు. అది కూడా 50 ఓవర్ల మ్యాచ్‌లో. ఇప్పుడు ఈ బౌలర్ ఎవరు అని ఆలోచిస్తూ ఉండాలి అతడి పేరు షాబాజ్ నదీమ్. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్. దేశీయ క్రికెట్‌లో జార్ఖండ్ తరఫున ఆడాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఐపిఎల్‌లో కూడా ఆడాడు. టీమిండియా కోసం రెండు టెస్ట్ మ్యాచ్‌లలో కూడా పాల్గొన్నాడు. అయితే గతంలో ఇతడు 10 పరుగులకు ఎనిమిది వికెట్ల రికార్డు క్రియేట్ చేశాడు.
అతను 2018 లో విజయ్ హజారే ట్రోఫీలో ఈ ప్రదర్శన చేశాడు. రాజస్థాన్ జట్టుపై ఈ ఫీట్ సాధించాడు. ఈ ఆట ద్వారా షాబాజ్ నదీమ్ 50 ఓవర్ల క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డును సృష్టించాడు. ఐదుగురిని బౌల్డ్ చేయగా, రెండు క్యాచ్ ఔట్‌లు, ఒకటి LBW. అతని విధ్వంసం కారణంగా జార్ఖండ్ రాజస్థాన్‌ను చాలా సులువుగా ఓడించింది. ఈ మ్యాచ్ చెన్నైలో జరిగింది. రాజస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి వికెట్ కోల్పోకుండా 32 పరుగులు చేసింది. అప్పుడు షాబాజ్ నదీమ్ ఎంట్రీ ఇచ్చాడు. అతను తన మొదటి ఓవర్‌లో ఒక వికెట్ తీసుకున్నాడు.
ఆ తర్వాత మైదానంలో రాజస్థాన్ బ్యాట్స్‌మెన్లను వరుసగా పెవిలియన్ పంపించాడు. రాజస్థాన్ మొదటి వికెట్ 10 వ ఓవర్లో పడిపోయింది ఆ తర్వాత మొత్తం18 ఓవర్లలో మొత్తం టీం 73 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టు 10 వికెట్లు కేవలం 41 పరుగులకు పడిపోయాయి. అమిత్ కుమార్, గౌతమ్ (17) పరుగులు, అంకితా లంబా (20), అశోక్ మెనారియా (4), మహిపాల్ లోమోర్డ్ (6), చేతన్ బిష్త్ (0), తజీందర్ సింగ్ (1), అభిమన్యు లంబా (0) రాబిన్ బిష్త్ (15) పరుగులకే ఔటయ్యారు. అనుకుల్ రాయ్ చివరి రెండు వికెట్లు సాధించాడు. కానీ నదీమ్ మొత్తం 10 వికెట్లు తీయలేకపోయాడు.