IPL 2021: ధోనికి ఇష్టమైన ఆటగాడిని టీ20 ప్రపంచకప్‌కి ఎంపిక చేయలేదు..! కారణం ఏంటంటే..?
IPL 2021: టీ 20 ప్రపంచకప్ కోసం భారత జట్టును ఇటీవల ప్రకటించారు. ఇందులో భారతదేశం ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను మాత్రమే ఎంపిక చేసింది.
IPL 2021: టీ 20 ప్రపంచకప్ కోసం భారత జట్టును ఇటీవల ప్రకటించారు. ఇందులో భారతదేశం ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను మాత్రమే ఎంపిక చేసింది. అందులో ఒకరి పేరును రిజర్వ్ ఆటగాళ్లలో ఉంచింది. అయితే ఇటీవల ఈ ఆటగాడి ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. మరొక విషయం ఏంటంటే అతనికి బ్యాటింగ్ కూడా తెలుసు. అతడు ఎవరో కాదు దీపక్ చాహర్. దేశీయ క్రికెట్‌లో రాజస్థాన్ సూపర్ కింగ్స్, ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కోసం ఆడుతున్నాడు. గత మూడు సంవత్సరాలలో ఈ బౌలర్ మంచి ప్రదర్శన చేశాడు. కానీ అతను టీ 20 వరల్డ్ కప్ కోసం టీమ్ ఇండియాలో భాగం కాదు. రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో ఉంచారు. దీపక్ చాహర్ సెప్టెంబర్ 19 న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను ఎంత కీలకమో ఒక్కసారి అందరికి గుర్తు చేశాడు. అతను లేకపోవడం వల్ల టీమిండియాకి ఎంత నష్టమో చెప్పకనే చెప్పాడు.
చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపక్ చాహర్ నాలుగు ఓవర్లలో కేవలం19 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అతను ముంబై ఓపెనర్లు క్వింటన్ డి కాక్, అన్మోల్‌ప్రీత్ సింగ్‌లను అవుట్ చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 156 పరుగులు చేసింది. తర్వాత వికెట్ల వేటకోసం రంగంలోకి దిగిన దీపక్ చాహర్ ఇద్దరు కీలక ఆటగాళ్లను పెవిలియన్ పంపించాడు. ముంబైకి మూడో ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. దీపక్ బంతి స్టంప్స్ లైన్‌లో పడి డికాక్ ప్యాడ్‌లకు తగిలింది. వెంటనే దీపక్ ఆనందంతో దూకి, అప్పీల్‌తో సంబరాలు జరుపుకున్నాడు. కానీ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. అప్పుడు ధోనీ DRS తీసుకున్నాడు. తర్వాత ఔట్‌గా తేలింది.
ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. తర్వాత దీపక్ చాహర్ మూడో ఓవర్‌లో అన్మోల్‌ప్రీత్ సింగ్‌పై వేటు వేశాడు. అతని బంతి వేగంగా వచ్చి ఆఫ్-స్టంప్‌పై పడింది. ఈ విధంగా అతను వరుసగా రెండు ఓవర్లలో రెండు వికెట్లు తీసి చెన్నై ని విజయతీరాలకు చేర్చాడు. ముంబై 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ ఎదురుదెబ్బల నుంచి జట్టు కోలుకోలేకపోయింది. మ్యాచ్‌ను 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీపక్ చాహర్ తన నాలుగు ఓవర్లలో అంటే 24 బంతుల్లో 13 డాట్స్ బాల్స్ వేశాడు. అతను అదనంగా ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. అతను ఇప్పుడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని తెలుస్తోంది. అతను ఐపిఎల్ 2021 లో వికెట్ టేకర్‌లలో ఆరో స్థానంలో ఉన్నాడు. అతను ఎనిమిది మ్యాచ్‌ల్లో 10 వికెట్లు సాధించాడు.