IND vs ENG: సర్ఫరాజ్ ఖాన్ లేదా రజత్ పాటిదార్.. విశాఖలో అరంగేట్రం చేసేదెవరు.. భారత ప్లేయింగ్ 11 ఇదే?

Sarfaraz Khan vs Rajat Patidar: తొలి 2 టెస్టు మ్యాచ్‌ల నుంచి విరాట్ కోహ్లీ తన పేరును ఉపసంహరించుకున్నాడు. దీంతో పాటు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఆడలేరు. తాజాగా యువ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. అలాగే టీమ్ ఇండియా మిడిలార్డర్‌లో రజత్ పాటిదార్ కూడా ఉంటాడు. సర్ఫరాజ్ ఖాన్ లేదా రజత్ పాటిదార్.. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఏ ఆటగాడికి అవకాశం దక్కుతుంది? అనేది ఆసక్తికరగా మారింది.

IND vs ENG: సర్ఫరాజ్ ఖాన్ లేదా రజత్ పాటిదార్.. విశాఖలో అరంగేట్రం చేసేదెవరు.. భారత ప్లేయింగ్ 11 ఇదే?
Sarfaraz Khan Vs Rajat
Follow us
Venkata Chari

|

Updated on: Feb 01, 2024 | 3:43 PM

Sarfaraz Khan vs Rajat Patidar: భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో రెండో టెస్టు విశాఖపట్నంలో జరగనుంది. అయితే టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ ఏలా ఉంటుందనే అంశంపై కీలక చర్చలు జరుగుతున్నాయి. తొలి 2 టెస్టు మ్యాచ్‌ల నుంచి విరాట్ కోహ్లీ తన పేరును ఉపసంహరించుకున్నాడు. దీంతో పాటు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఆడలేరు. తాజాగా యువ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. అలాగే టీమ్ ఇండియా మిడిలార్డర్‌లో రజత్ పాటిదార్ కూడా ఉంటాడు. సర్ఫరాజ్ ఖాన్ లేదా రజత్ పాటిదార్.. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఏ ఆటగాడికి అవకాశం దక్కుతుంది? ఈ ప్రశ్నకు టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ సమాధానమిచ్చాడు.

సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్‌లపై బ్యాటింగ్ కోచ్ ఏం చెప్పాడంటే?

సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్ మధ్య ఎంపిక అంత సులభం కాదని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అభిప్రాయపడ్డాడు. ఇద్దరూ అద్భుతమైన ఆటగాళ్లు. దేశవాళీ క్రికెట్‌లో సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటీదార్ల ప్రదర్శన ఎంత అద్భుతంగా ఉందో మనం చూశాం. ఈ రకమైన వికెట్‌పై, సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్ ఇద్దరూ X ఫ్యాక్టర్‌గా నిరూపించగలరని నేను నమ్ముతున్నాను. అయితే ఈ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాల్సి వస్తే అది అంత సులువు కాదని తెలిపాడు.

‘రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ నిర్ణయం తీసుకుంటారు..’

సర్ఫరాజ్‌ఖాన్‌, రజత్‌ పటీదార్‌లలో ఎవరికి అవకాశం దక్కాలనే దానిపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ నిర్ణయం తీసుకుంటారని విక్రమ్‌ రాథోడ్‌ అన్నాడు. ప్లేయింగ్ ఎలెవన్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేయనున్నారు. దీంతో పాటు విశాఖ పిచ్‌పై టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం పిచ్‌పై ఊహాగానాలు చేయడం కష్టమని అన్నాడు. అయితే, ఈ పిచ్‌పై స్పిన్నర్లకు సహాయం అందుతుంది. కానీ, బహుశా మొదటి రోజు మాత్రం కాకపోవచ్చు. ఏది ఏమైనా, సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్ మధ్య ఎవరికి అవకాశం లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రజత్ పాటిదార్/సర్ఫరాజ్ ఖాన్, కేఎస్ భరత్, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, సౌరభ్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..