AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో విమర్శకులకు చెక్.. తుఫాన్ హాఫ్ సెంచరీతో సెలెక్టర్లకు తలనొప్పి పెంచిన బ్యాడ్ లక్ ప్లేయర్..

Sanju Samson, india vs west indies: సంజూ శాంసన్ రెండో వన్డేలో విఫలమయ్యాడు. కానీ, మూడో వన్డేలో దానిని సరిదిద్దాడు. అర్ధ సెంచరీతో సత్తా చాటి, కీలక సమయంలో భారత్‌కు అద్భుత భాగస్వామ్యం అందించాడు. కానీ, హాఫ్ సెంచరీ తర్వాత త్వరగా ఔట్ అయ్యాడు. శాంసన్ 41 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టాడు. ఔటయ్యే ముందు సంజు గిల్‌తో కలిసి అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు . వీరిద్దరూ మూడో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

IND vs WI: 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో విమర్శకులకు చెక్.. తుఫాన్ హాఫ్ సెంచరీతో సెలెక్టర్లకు తలనొప్పి పెంచిన బ్యాడ్ లక్ ప్లేయర్..
Ind Vs Wi Sanju Samson
Venkata Chari
|

Updated on: Aug 01, 2023 | 10:45 PM

Share

Sanju Samson, india vs west indies: సంజూ శాంసన్ టీమిండియాలో చోటు దక్కకపోవడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. శాంసన్‌కు జట్టులో అవకాశం రాకపోతే, అతని అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ సృష్టిస్తుంటారు. సంజు ఇప్పుడు తన అభిమానులకు మంగళవారం ఆనందంగా ఉండే అవకాశం ఇచ్చాడు. ఈ సంతోషం ఎంతో సేపు నిలవలేకపోయినా సంజూ అభిమానులకు ఊరట లభించక తప్పలేదు. వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో అర్ధసెంచరీ సాధించిన సంజు ఆ తర్వాత ఔటయ్యాడు.

రెండో వన్డేలో సంజుకు అవకాశం లభించింది. కానీ, పెద్ద ఇన్నింగ్స్‌ ఆడలేకపోయాడు. ఆ తరువాత సంజు మళ్లీ విమర్శకుల టార్గెట్‌లో నిలిచాడు. ఇక మూడో వన్డేలో సంజూకి మళ్లీ అవకాశం లభించడంతో ఈ బ్యాట్స్‌మన్‌ చక్కటి ఇన్నింగ్స్‌ ఆడాడు.

బరిలోకి దిగిన వెంటనే తుఫాన్ స్టైల్ ఇన్నింగ్స్..

ఈ మ్యాచ్‌లో సంజు అటాకింగ్ మూడ్‌తో వచ్చాడు. అతను వచ్చిన వెంటనే, రెండవ బంతిని యాన్నిక్ కారియాపై సిక్సర్ కొట్టాడు. కారియా వేసిన నాలుగో బంతిని మళ్లీ సిక్సర్ బాదాడు. సంజు నిరంతరం దూకుడుగా ఆడుతూ కరియాను తన ప్రధాన లక్ష్యంగా చేసుకున్నాడు. 31వ ఓవర్‌లో మళ్లీ కారియాపై ఓ ఫోర్, సిక్సర్ బాదాడు. అయితే, తరువాత అతను వేగం తగ్గించాడు. 39వ బంతికి సంజూ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. సంజు తన ఇన్నింగ్స్‌ను మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. కానీ, హాఫ్ సెంచరీ తర్వాత వెంటనే పెవిలియన్ చేరాడు.

32వ ఓవర్ మూడో బంతికి అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఒక బంతి తర్వాత రొమారియో షెపర్డ్ బౌలింగ్‌లో షిమ్రాన్ హెట్మెయర్ క్యాచ్ పట్టాడు. శాంసన్ 41 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టాడు.

గిల్‌తో కీలక భాగస్వామ్యం..

ఔటయ్యే ముందు సంజు గిల్‌తో కలిసి అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు . వీరిద్దరూ మూడో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శుభారంభం తర్వాత భారత్ త్వరగా రెండు వికెట్లు కోల్పోవడంతో ఈ భాగస్వామ్యం ఏర్పడింది. గిల్, ఇషాన్ కిషన్ తొలి వికెట్‌కు 143 పరుగులు జోడించారు. ఇక్కడ ఇషాన్ 77 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత రితురాజ్ గైక్వాడ్ కేవలం 8 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక్కడ జట్టు కోలుకోవడానికి భాగస్వామ్యం అవసరం. ఆ పనిని గిల్, శాంసన్ అందించారు. 85 పరుగుల వద్ద గిల్ ఔటయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
స్టార్ హీరోతో సినిమా.. కానీ తప్పుకోవాలనిపించింది..
స్టార్ హీరోతో సినిమా.. కానీ తప్పుకోవాలనిపించింది..
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే