Sam Curran IPL Auction 2025: ఒకప్పుడు ఐపీఎల్ హిస్టరీలోనే కాస్ట్లీ పేయర్.. కట్ చేస్తే.. 2025 వేలంలో భారీగా పడిపోయిన ధర.. ఎంతంటే?
Sam Curran IPL 2025 Auction Price: గత ఐపీఎల్ సీజన్‌లో 18.5 కోట్లకు అమ్ముడుపోయిన సామ్ కర్రన్ తాజాగా అతి తక్కువ ధరకు అమ్ముడుపోయాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్ రౌండర్లలో సామ్ కుర్రాన్ ఒక్కడు. గత ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ తరుపున సామ్ కర్రన్ ఆడాడు. ఈసారి పంజాబ్ జట్టు తనని రిటైన్ చేసుకోలేదు. దీంతో ఐపీఎల్ మెగా వేలంలో రూ. 2.40 కోట్లకు సీఎస్‌కే కొనుగోలు చేసింది.
గత ఐపీఎల్ సీజన్‌లో 18.5 కోట్లకు అమ్ముడుపోయిన సామ్ కర్రన్ తాజాగా అతి తక్కువ ధరకు అమ్ముడుపోయాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్ రౌండర్లలో సామ్ కుర్రాన్ ఒక్కడు. గత ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ తరుపున సామ్ కర్రన్ ఆడాడు. ఈసారి పంజాబ్ జట్టు తనని రిటైన్ చేసుకోలేదు. దీంతో ఐపీఎల్ మెగా వేలంలో రూ. 2.40 కోట్లకు సీఎస్‌కే కొనుగోలు చేసింది. ఈ వేలంలో చెన్నై, లక్నో సామ్ కర్రన్‌కు పోటిపడ్డాయి.
2019 ఐపీఎల్ వేలంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 7.2 కోట్ల రూపాయలకు సామ్ కరన్‌ను జట్టులోకి తీసుకుంది. ఆ సీజన్లో పంజాబ్ తరఫున 9 మ్యాచ్‌లు ఆడాడు. 95 పరుగులు చేశాడు. ఐపీఎల్ అరంగేట్రం సీజన్‌లోనే 10 వికెట్లు తీశాడు. 2020 ఐపీఎల్ వేలానికి ముందు అతడిని పంజాబ్ విడుదల చేసింది. దీంతో అతన్ని రూ. 2.40 కోట్లకు సీఎస్‌కే కొనుగోలు చేసింది. గతంలో రెండు సీజన్లలో పసుపు జెర్సీలో IPL ఆడాడు. ఆ తర్వాత 2023లో కొచ్చిలో జరిగిన ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ మళ్లీ 18.50 కోట్ల రూపాయలకు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ను కైవసం చేసుకుంది. సామ్ ఐపీఎల్ సరైన పదర్శన చేయకపోవడంతో జట్టు అతన్ని విడిచిపెట్టింది. 2023లో 14 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 276 పరుగులు, 10 వికెట్లు తీశాడు. ఇక గత సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడి 270 పరుగులు చేసి 16 వికెట్లు తీశాడు. సామ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో పాటు ఇతర ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడాడు. అతను ది హండ్రెడ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ కోసం ఆడాడు. SA20 లీగ్‌లో అతను MI కేప్ టౌన్ తరపున ఆడాడు.
Badass entry of samcurran 💛🔥 Chuti kulandhai 🦁is back #CskAuction #IPLAuction2025 pic.twitter.com/0mZhfUUz1I
— ƖƧƛƛƇЄƊƖƬȤ (@isaac_editz) November 25, 2024