Celebrity breakups: ఈ స్పోర్ట్స్ స్టార్స్‌కు ఏమైంది – ఎందుకు వారి పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి..?
కలిసుందాం రా అంటారు ఎవరైనా. కానీ విడిపోదాం రా అనేందుకే ఒక్కటవుతున్నట్లున్నారు కొందరు సెలబ్రిటీలు. అజార్ నుంచి చాహల్‌దాకా.. సానియామీర్జా నుంచి సైనాదాకా కొందరు స్పోర్ట్స్ స్టార్స్ పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. పెళ్లంటే కొందరికి ఓ ఆటైపోయిందా? గేమ్ కాగానే గ్రౌండ్‌నుంచి వెళ్లిపోయినంత ఈజీగా.. జీవిత భాగస్వాములకు దూరమవుతున్నారా? ఏరికోరి పెళ్లిచేసుకున్నాక అసలు డైవోర్స్ దాకా ఎందుకొస్తోంది.

అప్పుడు సానియా, ఇప్పుడు సైనా.. అప్పట్లో మనోజ్.. ఈమధ్యే చాహల్ వైవాహిక జీవితం కూడా ఆటైపోతోందా? బ్యాడ్మింటన్ కపుల్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ విడిపోయారు. తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు.. సైనా నెహ్వాల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఏడేళ్ల వివాహ బంధానికి, 20 ఏళ్ల స్నేహానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. వివాదాలేం లేవు. పరస్పర అవగాహనతో సుహృద్భావ వాతావరణంలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తోటి బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్‌ని ఇష్టపడి పెళ్లిచేసుకున్నారు సైనా. 2004నుంచే ఒకరికొకరు పరిచయం. తమ ప్రేమను 2018లో పెళ్లిపీటల వరకు తీసుకెళ్లి ఒక్కటైందీ జంట. కొంతకాలంగా సైనా నెహ్వాల్-కశ్యప్ విడాకులపై ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే విడాకులపై క్లారిటీ ఇచ్చారు సైనా. సైనా కంటే ముందు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, షోయబ్ మాలిక్ 14ఏళ్ల తర్వాత విడిపోయారు. పాక్ క్రికెటర్‌తో సానియా పెళ్లి అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. సానియాతో విడాకుల తర్వాత షోయబ్ పాకిస్తానీ నటి సనా జావేద్‌ని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం తన కుమారుడితో ఉంటున్నారు సానియా మీర్జా. హైదరాబాద్‌కే చెందిన మరో బ్యాడ్మింటన్ స్టార్ గుత్తాజ్వాల కూడా గతంలో తోటి షట్లర్ చేతన్ ఆనంద్‌ని పెళ్లిచేసుకున్నా వారి వివాహబంధం ఎక్కువ కాలం నిలవలేదు. భర్తతో విడిపోయిన గుత్తాజ్వాల నాలుగేళ్లక్రితం తమిళ నటుడు విష్ణువిశాల్‌ని పెళ్లాడింది. ఈమధ్యే రెండో బిడ్డకు తల్లయింది. గ్రౌండ్‌లోకి దిగితే వికెట్లు పడేసే, పరుగుల వరదపారించే క్రికెటర్లలో కొందరి సంసారాలు...




