Sachin Tendulkar’s Life-Size Statue: ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) నవంబర్ 2 న వాంఖడే స్టేడియం ప్రాంగణంలో సచిన్ టెండూల్కర్ లైఫ్ సైజ్ స్టాట్యూని ప్రారంభించనుంది. ఈమేరకు గురువారం ఒక ఇంటరాక్షన్‌లో MCA అధ్యక్షుడు అమోల్ కాలే ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ, సచిన్ టెండూల్కర్ స్టాండ్ సమీపంలో ఈ విగ్రహాన్ని నవంబర్ 2 న శ్రీలంకతో టీమిండియా ప్రపంచ కప్ మ్యాచ్ సందర్భంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఈ వేడుకకు సచిన్‌తోపాటు పలువురు ప్రముఖులు, భారత జట్టు సభ్యులు కూడా ఈ వేడుకకు హజరుకానున్నారు. “మేం షెడ్యూల్, సమయాన్ని ఖరారు చేశాం” అని ఆయన తెలిపారు.
ఏప్రిల్‌లో 50 ఏళ్లు నిండిన లెజెండ్‌కు నివాళిగా టెండూల్కర్ జీవిత-పరిమాణ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అసోసియేషన్ యోచిస్తున్నట్లు ఫిబ్రవరిలో MCA అధ్యక్షుడు ప్రకటించారు.
2013లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన టెండూల్కర్ ఇప్పటికే తన సొంత మైదానం వాంఖడేలో అతని పేరు మీద ఒక స్టాండ్‌ని కలిగి ఉన్నాడు. గత సంవత్సరం, MCA భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్‌ను కార్పొరేట్ బాక్స్‌తో, దిలీప్ వెంగ్‌సర్కార్‌ను స్టాండ్‌తో సత్కరించింది.
కాగా, ఈ ప్రపంచకప్‌నకు బీసీసీఐ సచిన్‌కు గోల్డెన్ టిక్కెట్‌ను అందించింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌కు సచిన్ హాజరయ్యారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..