BCCI: బీసీసీఐ అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్.. నేను గంగూలీ, రోజర్ బిన్నీలా కాదంటూ షాకిచ్చిన మాస్టర్ బ్లాస్టర్..
Sachin Tendulkar Viral: భారత మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీల స్నేహం క్రికెట్ ఫీల్డ్‌తో పాటు మైదానం వెలుపల చూస్తూనే ఉంటుంటాం. మాజీ వెటరన్ ఆటగాళ్లిద్దరి పరస్పర బంధం అద్భుతంగా ఉంటుంది.
Sachin Tendulkar as BCCI President: భారత మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీల స్నేహం క్రికెట్ ఫీల్డ్‌తో పాటు మైదానం వెలుపల చూస్తూనే ఉంటుంటాం. మాజీ వెటరన్ ఆటగాళ్లిద్దరి పరస్పర బంధం అద్భుతంగా ఉంటుంది. అయితే, సచిన్ టెండూల్కర్ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మీడియా సమావేశంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను బీసీసీఐ ప్రెసిడెంట్‌గా పోటీ చేయడంపై షాకిచ్చే సమాధానం అందించాడు.
‘నేను రోజర్ బిన్నీ, సౌరవ్ గంగూలీలా కాదు’
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను బీసీసీఐ ప్రెసిడెంట్‌గా పోటీ చేయడంపై ప్రశ్నించగా, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని ఉద్దేశిస్తూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. దీంతో సభకు హాజరైన ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. నేను రోజర్ బిన్నీ, సౌరవ్ గంగూలీలా వేగంగా బౌలింగ్ చేయలేను అంటూ సచిన్ టెండూల్కర్ ఆశ్చర్యపరిచాడు. సౌరవ్ గంగూలీ గంటకు 140 కి.మీ వేగంతో బౌలింగ్ చేయడం గురించి మాట్లాడుతున్నాడని, అయితే ఆ తర్వాత గంగూలీకి వెన్నుముకలో సమస్య వచ్చిందని చెప్పుకొచ్చాడు.
పిచ్ వివాదంపై మాస్టర్ బ్లాస్టర్ ఏమన్నారు?
సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ.. నేను 140 కిమీ వేగంతో బంతిని వేయలేను అంటూ బీసీసీఐ ప్రెసిడెంట్ విషయాన్ని కొట్టిపారేశాడు. ఇక పిచ్ వివాదంపై మాస్టర్-బ్లాస్టర్ తన స్పందనను తెలియజేశాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ గతంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 4 టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. ఈ సిరీస్‌లో పిచ్‌పై చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ ఇది మొదటిసారి కాదు. టెస్ట్ క్రికెట్‌లో చర్చ ఎంతసేపు కొనసాగింది అనే దాని గురించి కాదు. అది ఎంత ఆకర్షణీయంగా ఉందనేది ముఖ్యం. టూర్‌కు వెళ్లినప్పుడు అక్కడ బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదని, ఎప్పుడూ ఛాలెంజింగ్‌గా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..