IND vs SA: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు.. టీమిండియాకు షాక్‌.. ప్రాక్టీస్‌లో స్టార్‌ ప్లేయర్‌కు గాయం

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది టీమ్ ఇండియా. అలాగే కొత్త సంవత్సరాన్ని విజయంతో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. అయితే రెండో టెస్టుకు ముందు భారత్‌కు ఒక షాక్‌ తగిలింది. భారత స్టార్ ఆల్ రౌండర్

IND vs SA: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు.. టీమిండియాకు షాక్‌.. ప్రాక్టీస్‌లో స్టార్‌ ప్లేయర్‌కు గాయం
Indian Cricket Team
Follow us

|

Updated on: Jan 02, 2024 | 6:45 AM

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య బుధవారం (జనవరి 3) నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ స్టేడియంలో జరగనుంది. ఇది టీమిండియాకు డూ ఆర్ డై మ్యాచ్‌. ఎందుకంటే రెండు టెస్టుల సిరీస్‌లో రోహిత్ సేన 0-1తో వెనుకంజలో ఉంది. ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ రేసులో నిలవాలంటే ఈ టెస్టులో విజయం సాధించడం టీమిండియాకు తప్పనసరి. తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది టీమ్ ఇండియా. అలాగే కొత్త సంవత్సరాన్ని విజయంతో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. అయితే రెండో టెస్టుకు ముందు భారత్‌కు ఒక షాక్‌ తగిలింది. భారత స్టార్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ గాయపడ్డాడు. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అతని భుజానికి గాయమైంది. అయితే బంతి భుజానికి తగిలిన తర్వాత కూడా ఠాకూర్ బ్యాటింగ్ కొనసాగించాడు. త్రోడౌన్ నుంచి బంతులు ప్రాక్టీస్ చేస్తుండగా విక్రమ్ రాథోడ్ విసిరిన బంతి శార్దూల్ ఠాకూర్ భుజానికి తగిలింది. ప్రాక్టీస్‌లో 15 నిమిషాలకే గాయపడ్డాడు. తొలి టెస్టు జట్టులో ఉన్న శార్దూల్ రెండో మ్యాచ్‌లో ఆడతాడా లేదా? దీనిపై ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. మొదటి టెస్టులో జస్ప్రీత్ బుమ్రా మినహా భారత బౌలర్లందరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. శార్దూల్ ఠాకూర్ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అయితే శార్దూల్ స్థానంలో రెండో టెస్టులో అవేశ్ ఖాన్ ఆడే అవకాశం ఉంది.

దక్షిణాఫ్రికాలో భారత్‌ ఇప్పటి వరకు టెస్టు సిరీస్‌ గెలవలేదు. తొలి టెస్టులో ఓడిపోవడంతో ఈసారి కూడా చరిత్ర సృష్టించే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌ను భారత్‌ ఒక్కసారి మాత్రమే డ్రా చేసుకోగలిగింది. ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇది అంత తేలికైన విషయం కాదు, ఎందుకంటే కేప్‌టౌన్‌లో భారత్‌ ఒక టెస్టు మ్యాచ్‌ని కూడా గెలవలేదు. న్యూలాండ్స్ వేదికగా ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో భారత్ నాలుగుసార్లు ఓడి రెండుసార్లు మాత్రమే డ్రా చేసుకోగలిగింది. ఇక సిరీస్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే భారత్ ఈసారి చరిత్ర సృష్టించాలి

టీమ్ ఇండియా:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యస్సవి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్) ), ప్రసిద్ధ్‌ కృష్ణ, KS భరత్ (వికెట్ కీపర్), అభిమన్యు ఈశ్వరన్, అవేష్ ఖాన్.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..