
South Africa vs Australia, 2nd Semi-Final 1st Innings Score: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య 2023 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ జరుగుతోంది. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో212 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా టీం ముందు 213 పరుగుల టార్గెట్ నిలిచింది. కష్టాల్లో ఉన్న సౌతాఫ్రికా టీంను డేవిడ్ మిల్లర్, క్లాసెన్ కీలక భాగస్వామ్యంతో ఆదుకున్నారు. ఈ క్రమంలో డేవిడ్ మిల్లర్ ప్రపంచకప్‌లో తొలి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పాట్ కమిన్స్ వేసిన బంతిని సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు. అలాగే నాకౌట్స్‌లో సెంచరీ చేసిన తొలి సౌతాఫ్రికా ప్లేయర్‌గా నిలిచాడు.
డేవిడ్ మిల్లర్ 101 పరుగులతో సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రపంచకప్‌లో తొలి సెంచరీ సాధించాడు. మిల్లర్ సిక్సర్ తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రపంచ కప్ నాకౌట్‌లలో దక్షిణాఫ్రికా టాప్ స్కోరర్‌గా కూడా నిలిచాడు. అంతకుముందు, ఫాఫ్ డు ప్లెసిస్ 2015 ప్రపంచకప్ సెమీ-ఫైనల్‌లో ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌పై 82 పరుగులు చేశాడు. మిల్లర్‌తో పాటు హెన్రిచ్ క్లాసెన్ 47 పరుగుల వద్ద ఔటయ్యాడు.
ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీశాడు. జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ తలో 2 వికెట్లు తీశారు.
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, కగిసో రబడ, తబ్రైజ్ షమ్సీ.
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.