SA Vs AFG: అందుకే ఓడిపోయాం.! సెమీస్ ఓటమిపై రషీద్ ఖాన్ సంచలన ఆరోపణలు.. ఇలా అనేశాడేంటి.?
T20 ప్రపంచకప్ 2024 మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్ ట్రినిడాడ్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో సఫారీ జట్టు 9 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించి.. 32 ఏళ్ల తర్వాత తొలిసారిగా వరల్డ్‌కప్ ఫైనల్‌కి చేరింది. ఇదిలా ఉంటే..
T20 ప్రపంచకప్ 2024 మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్ ట్రినిడాడ్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో సఫారీ జట్టు 9 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించి.. 32 ఏళ్ల తర్వాత తొలిసారిగా వరల్డ్‌కప్ ఫైనల్‌కి చేరింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ మ్యాచ్‌కు ఉపయోగించిన పిచ్‌పై దుమారం రేగింది. టీ20 ప్రపంచకప్‌లో కీలకమైన నాకౌట్ మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా కేవలం 56 పరుగులకే ఆఫ్ఘనిస్తాన్‌ను ఆలౌట్ చేసింది. దీంతో క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు ఐసీసీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ కూడా ఈ అంశంపైనే ఫిర్యాదు చేశాడు.
పిచ్‌పై దుమారం..
టీ20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్‌లో ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ జరిగిన సమయంలో పిచ్‌పై అసమాన బౌన్స్ కనిపించింది. అంతే కాకుండా మ్యాచ్‌కు ఉపయోగించిన పిచ్‌పై చాలా పగుళ్లు వచ్చాయి. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, వెటరన్ సౌతాఫ్రికా క్రికెటర్ షాన్ పొలాక్ పిచ్ నివేదికలో కూడా పేర్కొన్నారు. దీని వల్ల ఆఫ్ఘన్ బ్యాట్స్‌మెన్లు తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారని.. దక్షిణాఫ్రికా పేసర్లకు ఆ బౌన్స్ కలిసొచ్చిందని అంటున్నారు. అలాగే సంజయ్ మంజ్రేకర్, నవజ్యోత్ సింగ్ సిద్ధ్ ఈ పిచ్‌ను బిలో యావరేజ్‌గా అభివర్ణించారు. అలాగే ఐసీసీ పనితీరును విమర్శించారు. అతి ముఖ్యమైన మ్యాచ్‌కు ఐసీసీ ఇలాంటి చెత్త పిచ్‌ను సిద్దం చేశాడని మండిపడ్డారు. న్యూయార్క్ కంటే ఈ పిచ్ మరింత అధ్వాన్నంగా ఉందన్నారు. అటు మహ్మద్ కైఫ్ కూడా, ఇది పేలవమైన పిచ్ అని పేర్కొన్నాడు.
రషీద్ కూడా తన మాట..
ఐసీసీ పనితీరుపై అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశాడు. తమ జట్టు విమానం ట్రినిడాడ్‌కు 4 గంటలు ఆలస్యంగా చేరుకుందని టాస్ సమయంలో అతడు పేర్కొన్నాడు. దీంతో జట్టుకు విశ్రాంతి, ప్రాక్టీస్ చేసే అవకాశం లభించలేదని అన్నాడు. ఇంగ్లాండ్ వెటరన్ ప్లేయర్, వ్యాఖ్యాత మైకేల్ వాన్ కూడా ఇదే విషయాన్ని మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్థాన్‌పై తీవ్ర ప్రభావం చూపించిందని చెప్పాడు.
కాగా, భారత జట్టు కూడా అఫ్గానిస్థాన్ పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావచ్చు. సెమీఫైనల్లో ఇంగ్లాడ్‌ను చిత్తు చేస్తే.. ఫైనల్‌కి ముందు టీమిండియాకు గ్యాప్ ఉండకపోవచ్చు. వర్షం కారణంగా విమానాల రాకపోకలు ఆలస్యం కావచ్చు, స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటల నుంచి ఫైనల్ మ్యాచ్ జరగనున్నందున.. రెండో సెమీఫైనల్ విజేతకు ప్రాక్టీస్, విశ్రాంతికి లభించే అవకాశాలు తక్కువ.
So Afghanistan qualify for the WC semi winning in St Vincent on Monday night .. 4 hr flight delay on Tues to Trinidad so no time to practice or get accustomed to a new venue .. utter lack of respect to players i am afraid .. #T20WorldCup2024
— Michael Vaughan (@MichaelVaughan) June 27, 2024
ఇది చదవండి: సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ రద్దయితే.. ట్రోఫీ దక్కేది ఏ జట్టుకో తెలుసా.?
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..