IPL 2025: ఐపీఎల్ 2025 వేలంలో ఆర్‌టీఎంను చేర్చితే ఆటగాళ్ల దిమాక్ కరాబే.. ఎందుకో తెలుసా?
RTM in IPL 2025 Mega Auction: ఈసారి IPL 2025కి ముందు మెగా వేలం జరగనుంది. దీని గురించి అభిమానులు, ఆటగాళ్లు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే, ఈ వేలం ఈ సంవత్సరం డిసెంబర్‌లో జరగవచ్చని తెలుస్తోంది. ఇందులో ఇంకా చాలా సమయం మిగిలి ఉంది. వేలానికి ముందు బీసీసీఐ కొన్ని కొత్త నిబంధనలను కూడా ప్రకటించనుంది.
RTM in IPL 2025 Mega Auction: ఈసారి IPL 2025కి ముందు మెగా వేలం జరగనుంది. దీని గురించి అభిమానులు, ఆటగాళ్లు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే, ఈ వేలం ఈ సంవత్సరం డిసెంబర్‌లో జరగవచ్చని తెలుస్తోంది. ఇందులో ఇంకా చాలా సమయం మిగిలి ఉంది. వేలానికి ముందు బీసీసీఐ కొన్ని కొత్త నిబంధనలను కూడా ప్రకటించనుంది. నివేదికల ప్రకారం, ప్రతి ఫ్రాంచైజీ గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను ఉంచుకోవడానికి బోర్డు అనుమతించవచ్చు . అయితే ఈ ఆటగాళ్లను నేరుగా ఉంచుకుంటారా లేదా RTM కార్డ్ కూడా ఇందులో కొంత పాత్ర పోషిస్తుందా, అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
RTM ద్వారా, అన్ని ఫ్రాంచైజీలు మళ్లీ తమ జట్టులో ముగ్గురు ఆటగాళ్లను చేర్చుకోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ రూల్ వచ్చే ఐపీఎల్ వేలంలో తిరిగి వస్తుందా లేదా అనేది చూడాలి. ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు ఈ నిబంధనకు వ్యతిరేకంగా ఉన్నారు. వీటిలో భారత ప్రముఖ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరు కూడా ఉంది. IPL 2025 మెగా వేలంలో RTMని ఎందుకు చేర్చకూడదనే 3 కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం..
3. ఆటగాళ్లకు సరసమైన ధరలు లభించవు..
ఇప్పటికే చెప్పినట్లుగా, అశ్విన్ ఈ నియమంపై ప్రశ్నలు లేవనెత్తాడు. దీని వల్ల ఆటగాళ్లకు సముచితమైన విలువ లభించదని, వారు తక్కువ ధరలను పొందుతారని కూడా చెప్పుకొచ్చాడు. అదే సమయంలో, ఫ్రాంచైజీ ప్రయోజనం పొందుతుంది. ఆర్‌టీఎం కార్డులకు సంబంధించి కూడా నిబంధనలను ఖరారు చేయాలని అశ్విన్ అన్నారు. బిడ్డింగ్ నిర్దిష్ట మొత్తానికి చేరుకుంటేనే ఫ్రాంచైజీలు RTMని ఉపయోగించడానికి అనుమతించాలని తెలిపాడు.
2. కొన్ని ఫ్రాంచైజీలు కూడా RTM తిరిగి IPLకి రావాలని కోరుకోవడం లేదు..
చాలా ఫ్రాంచైజీలు కూడా ఐపీఎల్‌లో ఈ నిబంధనను మళ్లీ చూడాలని కోరుకోవడం లేదు. వారి ప్రకారం, RTM జట్టు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. నలుగురి కంటే ఎక్కువ మంది ఆటగాళ్లను కొనసాగించేందుకు బీసీసీఐని అనుమతించడంతోపాటు ఆర్టీఎంను పూర్తిగా రద్దు చేయడం మంచిదని అభిప్రాయపడ్డాడు.
1. RTM నుంచి పెద్ద జట్లు ప్రయోజనం పొందుతాయి..
ఈ నియమం పెద్ద జట్లకు తమ కీలక ఆటగాళ్లను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. తద్వారా మెగా వేలం సమయంలో కూడా వారి బ్యాలెన్స్‌పై ఎటువంటి ప్రభావం చూపించదు. టీమ్ మేనేజ్‌మెంట్‌తో పోరాడుతున్న చిన్న జట్లు RTMని సమర్థవంతంగా ఉపయోగించలేకపోవచ్చు. RTM లేకుండా వేలం వేయడం ప్రతి ఫ్రాంచైజీకి బలమైన జట్టును నిర్మించడంలో సహాయపడుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..