RCB vs MI Highlights, IPL 2021: బెంగళూరు బౌలర్ల దెబ్బకు ముంబై ఘోర పరాజయం.. 54 పరుగుల తేడాతో కోహ్లీసేన అద్భుత విజయం

Venkata Chari

|

Updated on: Sep 26, 2021 | 11:26 PM

RCB vs MI Highlights in Telugu: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగుల భారీ స్కోర్ సాధించగలిగింది. ముంబై గెలవాలంటే నిర్ణీత ఓవర్లలో 166 పరుగులు చేయాల్సి ఉంది.

RCB vs MI Highlights, IPL 2021: బెంగళూరు బౌలర్ల దెబ్బకు ముంబై ఘోర పరాజయం.. 54 పరుగుల తేడాతో కోహ్లీసేన అద్భుత విజయం
Ipl 2021, Rcb Vs Mi

RCB vs MI Live Score in Telugu: రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు టీం బౌలర్ల ధాటికి ముంబై కుప్పకూలింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై టీం కేవలం 18.1 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆర్‌సీబీ టీం 10 విజయాలతో 12 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఈ ఓటమితో ముంబై టీం పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఆదిలోనే మొదటి వికెట్‌ను కోల్పోయినా.. కెప్టెన్ కోహ్లీ(51), శ్రీకర్ భరత్(32), మ్యాక్స్‌వెల్‌(56) అద్భుత ఇన్నింగ్స్‌లతో ఆర్సీబీ 165 పరుగుల భారీ స్కోర్ సాధించగలిగింది. జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లలో 3 వికెట్లు తీసి జట్టుకు అత్యంత విజయవంతమైన బౌలర్‌గా మారాడు. ముంబై గెలవాలంటే నిర్ణీత 20 ఓవర్లలో 166 పరుగులు చేయాల్సి ఉంది. 

కాగితంపై చాలా బలంగా కనిపించే రెండు జట్ల మధ్య కీలకపోరు జరగనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ఎడిషన్‌లో భాగంగా 39 వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబయి ఇండియన్స్ టీం తలపడనున్నాయి. ‎ఐపీఎల్ ఫేజ్ 2 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ముంబై ఇండియన్స్ (MI) జట్లు ఇంకా విజయం సాధించలేదు. మరి ఈ మ్యాచులోనైనా గెలిచి పోటీలోకి రావాలని ఇరు జట్లు ఎదురుచూస్తున్నాయి.

ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 28 మ్యాచులు జరిగాయి. ఇందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11, ముంబై ఇండియన్స్ 17 మ్యాచుల్లో విజయం సాధించాయి. రెండో దశలో భాగంగా ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లో ఇరు జట్లు ఘోరంగా ఓడిపోయాయి. ఇక్కడ గతంలో ఈ రెండు జట్లు తలపడ్డాయి. అయితే ఫలితం సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఇందులో ఆర్‌సీబీ విజయం సాధించింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI అంచనా: దేవదత్ పాడిక్కల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఏబీ డివిలియర్స్ గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పటీదార్, శ్రీకర్ భారత్ (కీపర్) కైల్ జమీసన్/టిమ్ డేవిడ్, హర్షల్ పటేల్, నవదీప్ సైని/షాబాజ్ అహ్మద్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

ముంబయి ఇండియన్స్‌ ప్లేయింగ్ XI అంచనా: క్వింటన్ డి కాక్ (కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కిరన్ పొలార్డ్, కృనాల్ పాండ్య, హార్దిక్ పాండ్యా/సౌరభ్ తివారీ, ఆడమ్ మిల్నే, రాహుల్ చాహర్, జస్ప్రిత్ బుమ్రా ట్రెంట్ బౌల్ట్

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 26 Sep 2021 11:26 PM (IST)

    54 పరుగుల తేడాతో కోహ్లీసేన విజయం

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు టీం బౌలర్ల ధాటికి ముంబై కుప్పకూలింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై టీం కేవలం 18.1 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆర్‌సీబీ టీం 10 విజయాలతో 12 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఈ ఓటమితో ముంబై టీం పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.

  • 26 Sep 2021 11:12 PM (IST)

    బెంగళూరు‎ బౌలర్ హర్షల్ పటేల్ హ్యాట్రిక్

    బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ ఐపీఎల్ 2021 లో హ్యాట్రిక్ సాధించాడు. దీంతో ఈ సీజన్‌లో తొలి హ్యాట్రిక్ చేసిన బౌలర్‌గా మారాడు. హర్థిక్ పాండ్య, పొలార్డ్, రాహుల్ చాహర్‌లను పెవిలియన్ చేర్చి హ్యాట్రిక్ నమోదు చేశాడు.

  • 26 Sep 2021 10:52 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన ముంబై

    సూర్య కుమార్ యాదవ్ (8) రూపంలో ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. సిరాజ్ బౌలింగ్‌లో చాహల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

  • 26 Sep 2021 10:45 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై

    పాండ్యా (5) రూపంలో నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.

  • 26 Sep 2021 10:27 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన ముంబై

    ఇషాన్ కిషన్ (9) రూపంలో మూడో వికెట్‌గా చాహల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

  • 26 Sep 2021 10:25 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన ముంబై

    రోహిత్ శర్మ (43 పరుగులు, 28 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్స్) రూపంలో రెండో వికెట్‌గా మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

  • 26 Sep 2021 10:12 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన ముంబై

    డికాక్ (24 పరుగులు, 23 బంతులు, 4 ఫోర్లు) రూపంలో తొలి పవర్ ప్లే అవ్వగానే తొలి వికెట్‌గా చాహల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

  • 26 Sep 2021 09:57 PM (IST)

    5 ఓవర్లకు ముంబయి స్కోర్ 51/0

    రోహిత్ శర్మ, డికాక్ వరుస ఫోర్లతో బెంగళూరు బౌలర్లను చీల్చి చెండాడుతున్నారు. 5 ఓవర్లో మొత్తం మూడు ఫోర్లతో 15 పరుగులు సాధించారు.

  • 26 Sep 2021 09:47 PM (IST)

    3 ఓవర్లకు ముంబయి స్కోర్ 27/0

    రోహిత్ శర్మ వరుస ఫోర్లతో మూడో ఓవర్‌ను పూర్తిగా మార్చేశాడు. జైమిసన్ వేసిన ఈ ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు బాదేశాడు. దీంతో మూడో ఓవర్లో మొత్తం 17 పరుగులు వచ్చాయి.

  • 26 Sep 2021 09:18 PM (IST)

    20 ఓవర్లకు బెంగళూరు 165/6

    టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఆదిలోనే మొదటి వికెట్‌ను కోల్పోయినా.. కెప్టెన్ కోహ్లీ(51), శ్రీకర్ భరత్(32), మ్యాక్స్‌వెల్‌(56) అద్భుత ఇన్నింగ్స్‌లతో ఆర్సీబీ 165 పరుగుల భారీ స్కోర్ సాధించగలిగింది. ముంబై గెలవాలంటే నిర్ణీత 20 ఓవర్లలో 166 పరుగులు చేయాల్సి ఉంది.

  • 26 Sep 2021 09:07 PM (IST)

    మ్యాక్స్‌వెల్‌ అర్ధ సెంచరీ..

    రెండో వికెట్ పడిన అనంతరం క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్‌(56).. కెప్టెన్ కోహ్లీకి సహకారం అందిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే మ్యాక్స్‌వెల్‌ అర్ధ సెంచరీ పూర్తి చేసాడు. అయితే బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

  • 26 Sep 2021 08:54 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన బెంగళూరు

    బెంగళూరు మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లి(51) మిల్నే బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీనితో బెంగళూరు 16 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్లు నష్టానికి 126 పరుగులు చేసింది.

  • 26 Sep 2021 08:45 PM (IST)

    కోహ్లీ అర్ధ సెంచరీ.. 15 ఓవర్లకు బెంగళూరు 119/2

    ఫామ్‌లో ఉన్న బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి వరుస అర్ధ సెంచరీల మోత మోగిస్తున్నాడు. తాజాగా ముంబైపై మరో అర్ధ సెంచరీని సాధించాడు. అటు మ్యాక్స్‌వెల్‌(28) కూడా కోహ్లీకి సహకారం అందిస్తుండటంతో బెంగళూరు 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి పరుగులు చేసింది.

  • 26 Sep 2021 08:20 PM (IST)

    10 ఓవర్లకు బెంగళూరు 82/2

    హాఫ్ ఇన్నింగ్స్ అయింది. బెంగళూరు దూకుడుతనాన్ని ప్రదర్శిస్తోంది. విరాట్ కొహ్లి హాఫ్ సెంచరీకి దగ్గరవుతుండగా.. 10 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు 82 పరుగులు చేసింది.

  • 26 Sep 2021 08:18 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన బెంగళూరు..

    బెంగళూరు రెండో వికెట్ కోల్పోయింది. శ్రీకర్ భరత్ 32 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాహుల్ చాహార్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. దీనితో 9 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు రెండు వికెట్లు నష్టపోయి 75 పరుగులు చేసింది.

  • 26 Sep 2021 08:07 PM (IST)

    బెంగళూరు 58/1

    బెంగళూరు టీం స్కోర్ 50 పరుగులు దాటింది. రాహుల్ చాహార్ వేసిన ఏడో ఓవర్‌లో.. భరత్ మూడో బంతికి సిక్స్ కొట్టి టీమ్ స్కోర్‌ను అర్ధ సెంచరీ దాటించాడు. ఇక ఈ ఓవర్ ముగిసే సమయానికి బెంగళూరు వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది.

  • 26 Sep 2021 07:59 PM (IST)

    పవర్ ప్లే ముగిసింది.. బెంగళూరు బాదేసింది..

    మొదటి వికెట్ కోల్పోయిన తర్వాత బెంగళూరు చెలరేగిపోయింది. విరాట్ కోహ్లీ గేర్ మార్చి ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీనితో ఆరు ఓవర్లు ముగిసే సమయానికి బెంగళూరు వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. కోహ్లి(31), భరత్(13) క్రీజులో ఉన్నారు.

  • 26 Sep 2021 07:53 PM (IST)

    బుమ్రా ఓవర్‌లో కోహ్లీ, భరత్ చితక్కొట్టుడు..

    బుమ్రా వేసిన నాలుగో ఓవర్‌లో ఆర్సీబీ 16 పరుగులు రాబట్టింది. ఈ ఓవర్ రెండో బంతికి కోహ్లీ బౌండరీ కొట్టగా.. ఆ తర్వాత భారీ సిక్స్ బాదాడు. ఇక ఐదో బంతికి భరత్ ఓ ఫోర్ కొట్టాడు. తద్వారా 16 పరుగులు వచ్చాయి. దీనితో నాలుగు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది.

  • 26 Sep 2021 07:42 PM (IST)

    మొదటి వికెట్ కోల్పోయిన బెంగళూరు

    టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు తొలి వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్ పడిక్కల్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దీనితో బెంగళూరు 7 పరుగుల వద్ద మొదటి వికెట్‌ను కోల్పోయింది. రెండు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది.

  • 26 Sep 2021 07:09 PM (IST)

    ప్లేయింగ్ ఎలెవన్

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ ఎలెవన్): విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పాడిక్కల్, శ్రీకర్ భారత్ (కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, షాబాజ్ అహ్మద్, డేనియల్ క్రిస్టియన్, కైల్ జమీసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

    ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ ఎలెవన్): రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కిరాన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, ఆడమ్ మిల్నే, రాహుల్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్

  • 26 Sep 2021 06:58 PM (IST)

    మరికొద్దిసేపట్లో రోహిత్, కోహ్లీల పోరాటం

Published On - Sep 26,2021 6:57 PM

Follow us
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో