Highlights of IPL Match Result: Know Who Won CSK vs KKR Match: చివరి బంతికి గెలిచిన చెన్నై టీం.. ఓడినా ఆకట్టుకున్న కోల్‌కతా బౌలర్లు

CSK vs KKR: చివరి ఓవర్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ టీం 2 వికెట్ల తేడాతో గెలిచింది.

Highlights of IPL Match Result: Know Who Won CSK vs KKR Match: చివరి బంతికి గెలిచిన చెన్నై టీం.. ఓడినా ఆకట్టుకున్న కోల్‌కతా బౌలర్లు
Ipl 2021, Csk Vs Kkr
Follow us

|

Updated on: Sep 26, 2021 | 7:47 PM

CSK vs KKR, IPL 2021: అబుదాబిలో నేడు ఐపీఎల్ 2021 ఎడిషన్‌లో భాగంగా 38వ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ఉత్కంఠ పోరులో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. చివరి ఓవర్లో నాటకీయ పరిణాలు చోటుచేసుకోవడంతో ఎంతో ఉత్కంఠ రేకెత్తింది. ఓ దశలో ఈ మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్‌కు చేరుకుంటుందా అనే పరిస్థికి చేరుకుంది. కానీ, చివరి బంతికి పరుగు తీసి ధోని సేనే 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

చెన్నై ఓపెనర్లుగా బరిలోకి దిగిన రుతురాజ్(40), డుప్లిసిస్(43) అర్థ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి కోల్‌కతా బౌలర్లపై తొలి పవర్ ప్లే‌లో మంచి ఆధిపత్యం ప్రదర్శించారు. అయితే రుతురాజ్‌ను రస్సెల్ పెవిలియన్‌ పంపగా, డుప్లిసిస్‌ను ప్రసీద్ధ్ ఔట్ చేశాడు. ఆ తరువాత చెన్నై బ్యాట్స్‌మెన్స్ పరుగులు సాధించడంలో వెనుకబడ్డారు. అలీ(32) కాస్త బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించి కొంతసేపు బ్యాట్‌ను ఝులిపించాడు.

ఆ తరువాత రాయుడు 10, సురేష్ రైనా 11, ధోని 1, కుర్రాన్ 4 నిరాశ పరిచారు. దీంతో వీరి అనంతరం క్రీజులోకి వచ్చిన జడేజా తుఫాన్ ఇన్నింగ్స్‌తో టీంను విజయతీరాలకు చేర్చారు. జడేజా కేవలం 6 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సుల సహాయంతో 22 పరుగులు చేశాడు. ఈ టైంలో జడేజా 366 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించి చెన్నై టీంకు విజయాన్ని అందించాడు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ 3, ప్రసీద్ద్, ఫెర్గ్యూసన్, చక్రవర్తి, రస్సెల్ తలో వికెట్ పడగొట్టారు.

ఇందులో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరగులు సాధించింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ టీం ముందు 172 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

కోల్‌కతా ఓపెనర్లు అన్ని మ్యాచుల్లో మంచి ఓపెనింగ్ సెట్ చేసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పుతూ కేకేఆర్ విజయంలో కీలకపాత్ర పోషిస్తూ వస్తున్నారు. అయితే, ధోనీ సేన మాత్రం కేకేఆర్ ఓపెనర్లు శుభ్మన్ గిల్(9), వెంకటేష్ అయ్యర్ (18) ఎక్కువ సేపు క్రీజులో ఉంచకుండా త్వరగానే పెవిలియన్ చేర్చారు.

చా‎హర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే శుభ్మన్ గిల్ అనవసర పరుగుకు ప్రయత్నించి రాయుడు వేసిన అద్భుత త్రోకు రనౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం వెంకటేష్ అయ్యర్ 5.1 ఓవర్లో శార్దుల్ తొలి ఓవర్‌లోనే చిక్కి పెవిలియన్ చేరాడు. రాహుల్ త్రిపాఠి(45 పరుగులు, 33 బంతులు, 4 ఫోర్లు, 1 సిక్స్) మాత్రం ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు పరుగులు సాధిస్తూ స్కోర్ బోర్డును పెంచే ప్రయత్నం చేశాడు. అర్థ సెంచరీ చేయకుండానే జడేజా బౌలింగ్‌లో టీం స్కోర్ 89 పరగుల వద్ధ పెవిలియన్ చేరాడు. ఈ మధ్యలో కెప్టెన్ మోర్గాన్ (8) మరోసారి నిరాశ పరిచాడు.

అనంతరం నితీష్ రాణా* (37 పరుగులు, 27 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్స్), అండ్రూ రస్సెల్(20) కీలక భాగస్వామ్యం ఏర్పరిచి పరుగులు సాధించి, కేకేఆర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు. కానీ, శార్దుల్ మరోసారి కోల్‌కతాను కీలక సమయంలో దెబ్బతీసి బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తీక్ 236 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి కేవలం 11 బంతుల్లోనే 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 పరుగులు చేశాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో శార్దుల్, హజల్ వుడ్ తలో 2 వికెట్లు, జడేజా ఒక వికెట్ పడగొట్టారు.

Also Read: RCB vs MI Live Score, IPL 2021: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్

CSK vs KKR, IPL 2021: చెన్నై టార్గెట్ 172.. సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న కేకేఆర్ బ్యాట్స్‌మెన్స్ త్రిపాఠి, రానా, కార్తీక్

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?