IPL 2024: ఐపీఎల్ 2024 ట్రోఫీపై కన్నేసిన ఆర్‌సీబీ.. కొత్త డైరెక్టర్‌గా ఎవరిని నియమించిందంటే?

Royal Challengers Bangalore: ఈ సమాచారాన్ని తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ, 2019 నుంచి ఇంగ్లండ్ క్రికెట్ జట్టు డైరెక్టర్‌గా పనిచేసిన బోబాట్, 12 సంవత్సరాలుగా ECB సెటప్‌లో భాగంగా ఉన్నారు. ఈ సమయంలో, ఇంగ్లాండ్ T20, ODI ప్రపంచ కప్‌లను దక్కించుకుంది. జట్టు ప్రధాన కోచ్‌గా నియమితులైన ఆండీ ఫ్లవర్‌తో కూడా బోబాట్ సన్నిహితంగా పనిచేస్తాడు అంటూ తెలిపింది.

IPL 2024: ఐపీఎల్ 2024 ట్రోఫీపై కన్నేసిన ఆర్‌సీబీ.. కొత్త డైరెక్టర్‌గా ఎవరిని నియమించిందంటే?
Royal Challengers Bengaluru
Follow us
Venkata Chari

|

Updated on: Sep 30, 2023 | 5:07 AM

IPL 2024 (IPL 2024) ప్రారంభానికి ముందు, జట్టులో అనేక భారీ మార్పులు చేసిన RCB ఫ్రాంచైజీ.. ఇప్పుడు జట్టుకు కొత్త డైరెక్టర్‌ను నియమించింది. ఈ సమాచారాన్ని తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ, ఇంగ్లాండ్ జట్టుకు డైరెక్టర్‌గా పనిచేస్తున్న మో బోబాట్‌ను నియమించినట్లు ఫ్రాంచైజీ తెలిపింది. గతంలో మైక్ హెస్సన్ పోషించిన ఈ పాత్రను బోబాట్ పోషించనున్నారు. ప్రస్తుతం ECBలో పనిచేస్తున్న బొబాబ్, ECBలో తన స్థానాన్ని వదిలి వచ్చే ఏడాది ప్రారంభంలో RCBలో చేరనున్నారు.

ECB జట్టు అద్భుతమైన ప్రదర్శన..

దీని గురించి ఫ్రాంచైజీ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చింది. ‘మో బోబాట్ RCB జట్టుకు డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు. 2019 నుంచి ఇంగ్లండ్ క్రికెట్ జట్టు డైరెక్టర్‌గా పనిచేసిన బోబాట్, 12 సంవత్సరాలుగా ECB సెటప్‌లో భాగంగా ఉన్నారు. ఈ సమయంలో, ఇంగ్లాండ్ T20, ODI ప్రపంచ కప్‌లను దక్కించుకుంది. జట్టు ప్రధాన కోచ్‌గా నియమితులైన ఆండీ ఫ్లవర్‌తో కూడా బోబాట్ సన్నిహితంగా పనిచేస్తాడు’ అంటూ పోస్ట్‌లో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ప్రథమేష్ మిశ్రా సంతోషం..

ఆర్‌సీబీ చైర్మన్ ప్రథమేష్ మిశ్రా మాట్లాడుతూ, ‘టీమ్ క్రికెట్ డైరెక్టర్‌గా మో బోబాట్‌ను స్వాగతిస్తున్నందుకు మేం సంతోషిస్తున్నాం. RCB ఎల్లప్పుడూ పనితీరు ఆధారిత విధానంపై దృష్టి సారిస్తుంది. ఇంతకాలం ఇంగ్లండ్ జట్టుకు సేవలు అందించిన బోబాట్ ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నాడు. నైపుణ్యం, సంవత్సరాల అనుభవంతో అతను RCB జట్టుకు మార్గనిర్దేశం చేస్తాడు అంటూ సంతోషం వ్యక్తం చేశాడు.

బోబాట్ మాట్లాడుతూ..

ఆర్‌సీబీ టీమ్‌లో చేరిన అనంతరం బోబాట్ మాట్లాడుతూ.. ‘క్రికెట్ డైరెక్టర్‌గా ఆర్‌సీబీ జట్టులో చేరడం చాలా సంతోషంగా ఉంది. RCBకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వారికి సేవ చేయడం గొప్ప గౌరవం. ఆండీ ఫ్లవర్‌తో కలిసి పనిచేయడానికి నేను నిజంగా ఎదురుచూస్తున్నాను’ అంటూ తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..