AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: గాలిలో తేలుతూ కళ్లు చెదిరే క్యాచ్.. కాటేరమ్మ కొడుకుకు దిమ్మతిరిగే షాకిచ్చిన వీడియో చూశారా?

Rovman Powell Catch: ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న 45వ మ్యాచ్‌లో ఒక అద్భుతం చోటుచేసుకుంది. క్రీజులో ప్రమాదకరంగా మారుతున్న హెన్రిచ్ క్లాసెన్‌ను అవుట్ చేయడానికి కేకేఆర్ ఫీల్డర్ రోవ్‌మన్ పావెల్ పట్టిన క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

Video: గాలిలో తేలుతూ కళ్లు చెదిరే క్యాచ్.. కాటేరమ్మ కొడుకుకు దిమ్మతిరిగే షాకిచ్చిన వీడియో చూశారా?
Rovman Powell Stunning Catch Dismisses Heinrich Klaasen
Venkata Chari
|

Updated on: May 03, 2026 | 5:05 PM

Share

Rovman Powell Stunning Catch Dismisses Heinrich Klaasen: ఐపీఎల్ 2026 సీజన్ 45వ మ్యాచ్‌లో ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. అయితే, మధ్య ఓవర్లలో కేకేఆర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీశారు. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్ వికెట్ ఈ మ్యాచ్‌ను మలుపు తిప్పింది.

గాలిలో డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్..

సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ 12వ ఓవర్లో వరుణ్ చక్రవర్తి వేసిన బంతిని క్లాసెన్ భారీ షాట్ ఆడబోయాడు. బంతి గాలిలోకి లేవడంతో అందరూ అది బౌండరీ వెళ్తుందని భావించారు. కానీ, లాంగ్ ఆన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రోవ్‌మన్ పావెల్ అసాధారణ వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి, గాలిలో డైవ్ చేస్తూ ఆ అద్భుతమైన క్యాచ్‌ను ఒడిసిపట్టుకున్నాడు. పావెల్ విన్యాసం చూసి స్టేడియంలోని ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. క్లాసెన్ 8 బంతుల్లో 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

కళ్లు చెదిరే క్యాచ్..

మ్యాచ్ పరిస్థితి, పాయింట్ల పట్టిక..

ఈ మ్యాచ్‌కు ముందు ఎస్‌ఆర్‌హెచ్ వరుసగా ఐదు విజయాలతో జోరు మీద ఉంది. పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు, కేకేఆర్ జట్టుకు ఈ సీజన్ అంతగా కలిసి రాలేదు. 8 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలతో ఎనిమిదో స్థానంలో ఉన్న అజింక్యా రహానే సేనకు ఈ మ్యాచ్ గెలవడం అత్యవసరం.

క్లాసెన్ అవుట్ – హైదరాబాద్‌కు పెద్ద దెబ్బ

ఈ సీజన్‌లో క్లాసెన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను ఇప్పటికే 500 పైగా పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. అటువంటి కీలక ఆటగాడు పావెల్ మెరుపు క్యాచ్‌కు దొరికిపోవడం హైదరాబాద్ అభిమానులను నిరాశకు గురిచేసింది. ఈ క్యాచ్ కేకేఆర్ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us