Rohit: అప్పుడు అన్‌ఫిట్ అంటూ కామెంట్స్.. కట్ చేస్తే.. ఇప్పుడు షమాతోనే సలాం కొట్టించుకున్న హిట్ మ్యాన్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో రోహిత్ శర్మ అద్భుతంగా రాణించి భారత్‌ను గెలిపించాడు. మ్యాచ్‌కు ముందు రోహిత్‌పై బాడీ షేమింగ్ చేసిన కాంగ్రెస్ నేత షమా మహమ్మద్, ఆయన విజయం తర్వాత తన వైఖరిని మార్చి పొగడ్తలు కురిపించింది. నెటిజన్లు ఆమె గత వ్యాఖ్యలను గుర్తుచేస్తూ తీవ్రంగా ట్రోల్ చేశారు. బౌలర్ల అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్‌ను కట్టడి చేసిన భారత్, ఛాంపియన్స్ ట్రోఫీని మూడోసారి సాధించింది.

Rohit: అప్పుడు అన్‌ఫిట్ అంటూ కామెంట్స్.. కట్ చేస్తే.. ఇప్పుడు షమాతోనే సలాం కొట్టించుకున్న హిట్ మ్యాన్
Rohit Sharma Shama Mohammed

Updated on: Mar 10, 2025 | 11:20 AM

దుబాయ్ వేదికగా జరిగిన 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత జట్టు విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శనతో 76 పరుగులు చేసి మ్యాచ్‌ను విజయవంతంగా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఘన విజయం అనంతరం, ఇటీవల రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ చేసిన కాంగ్రెస్ నేత షమా మహమ్మద్, తన గత వ్యాఖ్యలను మరిచిపోయినట్లుగా, రోహిత్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.

రోహిత్ శర్మ తన ఫిట్‌నెస్ కారణంగా గత కొన్ని రోజులుగా విమర్శలు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా, ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్‌ మ్యాచ్‌ల సమయంలో షమా మహమ్మద్ అతని శరీరాకృతి గురించి వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. “రోహిత్ శర్మ ఓ స్పోర్ట్స్ మ్యాన్ ఇంత ఫ్యాట్‌గా ఉంటాడా? బరువు తగ్గాల్సిన అవసరం ఉంది!” అంటూ ట్వీట్ చేయడం ద్వారా, అతని కెప్టెన్సీని కూడా విమర్శించింది.

ఈ వ్యాఖ్యలపై రోహిత్ అభిమానులు, బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. టీమిండియా కోసం నిరంతరం కృషి చేస్తున్న కెప్టెన్‌ను ఇలా అవమానించడం తగదని పేర్కొన్నారు. టీ20 వరల్డ్‌కప్‌ను గెలిపించిన వ్యక్తిని ఇలాంటి విమర్శలు చేయడం సమంజసం కాదని నెటిజన్లు విరుచుకుపడ్డారు. BCCI కూడా షమా మహమ్మద్ వ్యాఖ్యలను ఖండించింది.

భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన అనంతరం, షమా మహమ్మద్ తన వైఖరిని మార్చింది. టీమిండియాకు శుభాకాంక్షలు తెలుపుతూ, రోహిత్ శర్మకు హ్యాట్స్ ఆఫ్ అంటూ ట్వీట్ చేసింది. “రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును ముందుండి నడిపించాడు. మిడిల్ ఓవర్లలో శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తమ బాధ్యతను చక్కగా నిర్వర్తించారు” అంటూ ఆమె పోస్ట్ చేసింది.

ఇక్కడే నెటిజన్లు షమా మహమ్మద్‌ను ఉతికి ఆరేశారు. “అప్పుడు తిట్టిన నోరు, ఇప్పుడు పొగడ్తలు ఎలా?” అంటూ ట్వీట్లు చేశారు. షమా మహమ్మద్ మునుపటి వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, “వారానికి ముందు రోహిత్‌ను బాడీ షేమింగ్ చేసిన మీరు ఇప్పుడు ఈ పొగడ్తలేంటి?” అంటూ నెటిజన్లు వ్యంగ్యంగా స్పందించారు.

ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 251 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శన కనబరిచారు. లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ ముందుండి నడిపించాడు. 76 పరుగులతో భారత్ విజయానికి పునాది వేసి, తన విమర్శకుల నోళ్లు మూయించాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..