AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బాయిలు ఈగోకి పోతే ఇట్లానే ఉంటుంది.. 20 కేజీల బరువు తగ్గించుకుని హిట్‌మ్యాన్ అనిపించుకున్నాడుగా

Rohit Sharma: టీమిండియా ప్లేయర్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను చూసిన అభిమానులు, తోటి క్రీడాకారులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "ఇదే అసలు హిట్‌మ్యాన్!," "మోటివేషన్ కావాలంటే రోహిత్‌ని చూడాలి," అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ మేరకు కొత్త లుక్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.

అబ్బాయిలు ఈగోకి పోతే ఇట్లానే ఉంటుంది.. 20 కేజీల బరువు తగ్గించుకుని హిట్‌మ్యాన్ అనిపించుకున్నాడుగా
Rohit Sharma Weight
Venkata Chari
|

Updated on: Oct 09, 2025 | 12:19 PM

Share

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తన అద్భుతమైన ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో దేశవ్యాప్తంగా అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. గత కొంతకాలంగా ఫిట్‌నెస్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న ‘హిట్‌మ్యాన్’ (Hitman), తన అంకితభావంతో ఏకంగా 20 కిలోల బరువు తగ్గి పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు.

95 నుంచి 75 కేజీలకు..!

నివేదికల ప్రకారం, రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం తీసుకున్న సమయంలో, తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించారు. దాదాపు 20 కిలోలు (95 కేజీల నుంచి 75 కేజీలకు) తగ్గాడు. 2027 వన్డే ప్రపంచకప్‌ వరకు వన్డే ఫార్మాట్‌లో కొనసాగాలని లక్ష్యంగా పెట్టుకుని, స్టామినా, ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకున్నట్లు తెలుస్తోంది. బరువు తగ్గడంతో పాటు, బీసీసీఐ (BCCI) ప్రవేశపెట్టిన కఠినమైన బ్రోంకో టెస్ట్ (Bronco Test)లో కూడా రోహిత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు.

ఇవి కూడా చదవండి

కొత్త లుక్‌తో ఆస్ట్రేలియా సిరీస్‌కు..!

రోహిత్ శర్మ కొత్తగా, నాజూగ్గా కనిపించిన తర్వాత అనేక సందర్భాలు వార్తల్లో నిలిచాయి. తాజాగా జరిగిన ‘సీయట్ క్రికెట్ అవార్డ్స్’ (Ceat Cricket Awards) వేడుకలో తన భార్య రితికా సజ్దే (Ritika Sajdeh)తో కలిసి ర్యాంప్‌పై గ్లామరస్‌గా అడుగుపెట్టారు. స్లిమ్ లుక్‌లో, స్టైలిష్ దుస్తులలో రోహిత్ కనిపించిన తీరు అక్కడి వారందరి దృష్టిని ఆకర్షించింది.

ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ కోసం సిద్ధమయ్యే క్రమంలో, ఎయిర్‌పోర్టులో పూర్తి బ్లాక్ డ్రెస్‌లో కనిపించిన రోహిత్ ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ లుక్‌లో ఆయన చాలా ఫిట్‌గా, యంగ్‌గా కనిపించడంతో అభిమానులు పండగ చేసుకున్నారు.

హిట్‌మ్యాన్ డైట్ సీక్రెట్ ఇదే..!

రోహిత్ శర్మ వెయిట్ లాస్ వెనుక ఉన్న కఠినమైన డైట్ ప్లాన్ గురించి కూడా వార్తలు వచ్చాయి. తనకిష్టమైన బిర్యానీ, వడాపావ్, బటర్ చికెన్ వంటి ఆహారాలకు దూరంగా ఉండి, కార్బోహైడ్రేట్‌లు తగ్గించి, ప్రొటీన్ ఎక్కువగా ఉన్న బ్యాలెన్స్‌డ్ డైట్‌ను ఫాలో అయ్యారట.

ఉదయం 7:00 గంటలకు 6 బాదం పప్పులు, మొలకెత్తిన సలాడ్, ఫ్రెష్ జ్యూస్

ఉదయం 9:30 గంటలకు పండ్లతో కూడిన ఓట్‌మీల్, ఒక గ్లాసు పాలు

ఉదయం 11:30 గంటలకు పెరుగు, కొబ్బరి నీళ్లు

మధ్యాహ్నం 1:30 గంటలకు కూరగాయలు, పప్పు, కొద్దిగా అన్నం, సలాడ్

సాయంత్రం 4:30 గంటలకు ఫ్రూట్ స్మూతీ, డ్రై ఫ్రూట్స్

రాత్రి 7:30 గంటలకు పనీర్, కూరగాయలు, వెజిటబుల్ సూప్

రాత్రి 9:30 గంటలకు ఒక గ్లాసు పాలు

అభిమానుల ప్రశంసలు..

రోహిత్ శర్మ ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను చూసిన అభిమానులు, తోటి క్రీడాకారులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “ఇదే అసలు హిట్‌మ్యాన్!,” “మోటివేషన్ కావాలంటే రోహిత్‌ని చూడాలి,” అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఈ మార్పు కేవలం బాహ్య రూపానికే పరిమితం కాకుండా, రాబోయే సిరీస్‌లలో రోహిత్ మరింత మెరుగైన ఆటతీరును ప్రదర్శించడానికి దోహదపడుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..