IND vs ENG 1st Test: ఆ ఇద్దరితోనే మాకు తలనొప్పి.. పక్కా వ్యూహంతో ఉప్పల్ బరిలోకి: రోహిత్ శర్మ
Rohit Sharma: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం నుంచి ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుండగా, రెండో మ్యాచ్ విశాఖపట్నంలోని వైఎస్ఆర్ స్టేడియంలో జరగనుంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మూడో మ్యాచ్ జరగనుంది. అదేవిధంగా నాలుగో టెస్ట్ మ్యాచ్ రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో జరగనుండగా, చివరి టెస్టు మ్యాచ్‌కు ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
Rohit Sharma: ప్రపంచ క్రికెట్లో దిగ్గజ టీమ్స్ భారత్-ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జనవరి 25వ తేదీ నుంచి టెస్ట్ మ్యాచ్ ప్రారంభ కానుంది. మ్యాచ్ కోసం భారీ ఏర్పాట్లు చేసింది హైదరాబాద్ క్రికెట్ అసొసియేషన్. కాగా, నిన్న హైదరాబాద్ చేరుకున్న భారత జట్టు, దిగిన వెంటనే ప్రాక్టీస్ షురూ చేసింది. ఈ క్రమంలో నేడు మీడియాతో టీమీండియా సారథి రోహిత్ శర్మ మాట్లాడాడు.
‘ఇంగ్లాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో రాణిస్తామని, అద్భుతమైన ప్రదర్శనతో సిరీస్ కైవసం చేసుకుంటామని’ రోహిత్ శర్మ్ చెప్పుకొచ్చాడు. ‘రెండు మాసాలుగా మా ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇంగ్లాండ్ జట్టులో బలమైన ఆటగాళ్ళు ఉన్నారు. ఆ జట్టును తక్కువ అంచనా వేయలేం. పక్కా వ్యూహంతో ఉప్పల్ మైదానంలోకి దిగుతాం’ అంటూ భారత జట్టు ప్రణాళికలను రోహిత్ వెల్లడించాడు.
‘టెస్ట్ సిరీస్‌లో అనేక మార్పులు సంతరించుకున్నాయి. 20 ఏళ్ల టెస్ట్ మ్యాచ్‌కి.. ఇప్పుడు జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లకు చాలా వ్యత్యాసం ఉంది. విరాట్ దూరం అవ్వడం భారత జట్టుకు లోటే. అయితే, జట్టులో స్థానం కోసం యువ ఆటగాళ్లను పరిగణిస్తాం. సీనియర్లకు కూడా తలుపులు ముసుకుపోలేదు. మూడో స్పిన్నర్ గా అక్షర్, కుల్దీప్‌లలో ఎవరిని అదించాలన్నది తల నొప్పిగా మారింది. పరిస్థితులకు అనుగుణంగా ఎవ్వరినీ బరిలోకి దించాలో నిర్ణయిస్తాం. సిరాజ్ గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. మా జట్టులో ఆయన ఒక కీలక బౌలర్’ అంటూ భారత సారథి చెప్పుకొచ్చాడు.
ఫేక్ పాస్‌లతో వస్తే కఠిన చర్యలు: రాచకొండ సీపీ సుధీర్ బాబు
రేపటి టెస్ట్ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఉదయం 6:30 నుంచి ప్రేక్షకులకు అనుమతి ఉంటుందని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. అలాగే, 1500 మంది పోలీసులతో పాటు ఆక్టోపస్, వివిధ పోలీస్ విభాగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే, 100 షీ టీమ్స్ మఫ్టీలో ఉంటాయని, కెమెరాలు, లాప్ టాప్, మ్యాచ్ బాక్స్,పెన్, బ్యాటరీ,హెల్మెట్ లు అనుమతి లేదని ఆయన తెలిపారు.
అలాగే, ట్రాఫిక్ ఎక్కువ ఉండే సమయంలోనే మ్యాచ్ ఉంటుందని, కాబట్టి ఇబ్బందులు కలగకుండా ఫోకస్ పెట్టామని, ఫేక్ పాస్ లతో వస్తె చర్యలు తప్పవంటూ ఆయన హెచ్చరించారు.
మొదటి టెస్టుకు భారత జట్టు అంచనా:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రీకర్ భరత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
పూర్తి సిరీస్ షెడ్యూల్..
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం నుంచి ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుండగా, రెండో మ్యాచ్ విశాఖపట్నంలోని వైఎస్ఆర్ స్టేడియంలో జరగనుంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మూడో మ్యాచ్ జరగనుంది. అదేవిధంగా నాలుగో టెస్ట్ మ్యాచ్ రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో జరగనుండగా, చివరి టెస్టు మ్యాచ్‌కు ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్..
జనవరి 25 నుంచి 29 వరకు – మొదటి టెస్ట్ (హైదరాబాద్)
ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు – రెండో టెస్టు (విశాఖపట్నం)
ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు – మూడో టెస్టు (రాజ్‌కోట్)
ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు – నాల్గవ టెస్ట్ (రాంచీ)
మార్చి 7 నుంచి 11 వరకు – ఐదవ టెస్ట్ (ధర్మశాల).
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..