AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: టీమిండియాకు షాక్‌.. దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌కు రోహిత్‌ దూరం.. వన్డేలకు కూడా డౌటే!

కీలకమైన దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియాకు పెద్ద షాక్‌ తగిలింది. భారత వన్డే జట్టు కెప్టెన్‌గా, టెస్ట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌గా పగ్గాలందుకున్న రోహిత్‌ శర్మ గాయం

IND vs SA: టీమిండియాకు షాక్‌.. దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌కు రోహిత్‌ దూరం.. వన్డేలకు కూడా డౌటే!
Basha Shek
|

Updated on: Dec 13, 2021 | 8:07 PM

Share

కీలకమైన దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియాకు పెద్ద షాక్‌ తగిలింది. భారత వన్డే జట్టు కెప్టెన్‌గా, టెస్ట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌గా పగ్గాలందుకున్న రోహిత్‌ శర్మ గాయం కారణంగా దక్షిణాఫ్రికా టెస్ట్‌ సిరీస్‌కు దూరమయ్యాడు. సోమవారం ముంబయిలో జరిగిన ప్రాక్టీస్‌ సెషనల్‌లో బంతి రోహిత్‌ చేతిని బలంగా తాకింది. దీంతో అతను నొప్పితో చాలాసేపు విలవిల్లాడాడు. ప్రస్తుతం అతని గాయం తీవ్రంగా మారిందని, అందుకే ముందు జాగ్రత్తగా సౌతాఫ్రికా టూర్‌ నుంచి తప్పుకున్నట్లు. అతని స్థానంలో భారత్‌- ఏ జట్టు కెప్టెన్‌ ప్రియాంక్‌ పాంచల్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

భారత జట్టు డిసెంబర్‌ 16న దక్షిణాఫ్రికా విమానం ఎక్కనుంది. పర్యటనలో భాగంగా సౌతాఫ్రికాతో మూడు టెస్ట్‌లు, మూడు వన్డేలు ఆడనుంది. డిసెంబర్‌ 26న బాక్సింగ్‌ డే టెస్ట్‌తో ఈ సిరీస్ ప్రారంభంకానుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం టీమిండియా ముంబయిలోని హోటల్‌లో క్వారంటైన్‌లో గడుపుతోంది. అయితే ప్రాక్టీస్‌లో రోహిత్‌కు తగిలని గాయం తీవ్రమైనదేనని దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌కు పూర్తి దూరంగా ఉంటాడని తెలుస్తోంది. అయితే వన్డేలకు అందుబాటులో ఉంటాడా లేదా అన్న విషయంలో ఇప్పుడే స్పష్టత రాకపోవచ్చని తెలుస్తోంది. కాగా టీ-20 ప్రపంచ కప్ తర్వాత కోహ్లి నుంచి టీ-20 కెప్టెన్సీని రోహిత్ స్వీకరించాడు. ఆతర్వాత వన్డే పగ్గాలను కూడా అతనికే అప్పగించింది బీసీసీఐ. ఆతర్వాత దక్షిణాఫ్రికా పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో అజింక్యా రహానే స్థానంలో టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా రోహిత్‌ను నియమించిన సంగతి తెలిసిందే.

Also Read:

ICC Awards: ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌.. మహిళల్లో ఎవరంటే..

ధోని నగరంలో చుక్కలు చూపించిన మరో వికెట్ కీపర్.. 8 సిక్సర్లు 11 ఫోర్లతో తుఫాన్‌ సెంచరీ..

Virat Kohli: టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని కోహ్లీని వ్యక్తిగతంగా అభ్యర్థించా.. కానీ అతను వైదొలిగాడు..!