PAK Vs WI: టీ20లో వెస్టిండీస్‎పై పాకిస్తాన్ ఘన విజయం.. రాణించిన హైదర్ అలీ, రిజ్వాన్..

కరాచీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‎లో వెస్టిండీస్‎పై పాకిస్తాన్ 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

PAK Vs WI: టీ20లో వెస్టిండీస్‎పై పాకిస్తాన్ ఘన విజయం.. రాణించిన హైదర్ అలీ, రిజ్వాన్..
Pak
Follow us

|

Updated on: Dec 14, 2021 | 6:38 AM

కరాచీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‎లో వెస్టిండీస్‎పై పాకిస్తాన్ 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 6 వికెట్లకు 200 పరుగులు చేసింది. 201 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‎కు దిగిన వెస్టిండీస్ జట్టు కేవలం 137 పరుగులకే ఆలౌటైంది. మహ్మద్ రిజ్వాన్, హైదర్ అలీ అర్ధ సెంచరీలతో పాక్ విజయం సాధించారు. బౌలింగ్‎లో మహ్మద్ వసీమ్ 4, షాదాబ్ ఖాన్ 3 వికెట్లు తీశారు. ‎ వెస్టిండీస్‌ను ఓడించి పాకిస్తాన్ ప్రపంచ రికార్డు కూడా సృష్టించింది. ఏడాది వ్యవధిలో టీ20లో అత్యధిక విజయాలు సాధించి తొలి జట్టు పాకిస్తాన్ నిలిచింది. 17 విజయాల రికార్డును బద్దలు కొట్టింది. భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఏడాదిలో 15 విజయాలు నమోదు చేసి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. హైదర్ అలీ 39 బంతుల్లో 68 పరుగులు చేసి పాక్ విజయంలో కీలక పాత్రో పోషించాడు. 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. హైదర్ అలీ 174 స్ట్రైక్ రేట్ వద్ద పరుగులు చేశాడు. రోహిత్ శర్మను ఆదర్శంగా భావించిన హైదర్ అలీ కేవలం 29 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.

మహ్మద్ రిజ్వాన్ కూడా 78 పరుగులు చేశాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం డౌక్ ఔటయ్యాడు. మూడు ఫార్మాట్లలో ఈ ఏడాది నాలుగోసారి ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. వెస్టిండీస్‌లో ఏ బ్యాట్స్‌మెన్ కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. వికెట్ కీపర్ షాయ్ హోప్ 26 బంతుల్లో 31 పరుగులు చేశాడు. రోవ్‌మన్ పావెల్ 23 పరుగులు చేశాడు. ఓడియన్ స్మిత్ 24, రొమారియో షెపర్డ్ 21 పరుగులు చేశారు.

Read Also.. IND vs SA: టీమిండియాకు షాక్‌.. దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌కు రోహిత్‌ దూరం.. వన్డేలకు కూడా డౌటే!

Latest Articles
కమల్ హాసన్ పై డైరెక్టర్ ఫిర్యాదు..
కమల్ హాసన్ పై డైరెక్టర్ ఫిర్యాదు..
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు