AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: హిట్‌మ్యాన్ వారసుడొచ్చాడోచ్.! మరోసారి తండ్రైన రోహిత్ శర్మ

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి రితిక శుక్రవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే వీరికి ఓ కూతురు(సమైరా) ఉన్న సంగతి తెలిసిందే.

Rohit Sharma: హిట్‌మ్యాన్ వారసుడొచ్చాడోచ్.! మరోసారి తండ్రైన రోహిత్ శర్మ
Rohit Sharma & Ritika
Ravi Kiran
|

Updated on: Nov 16, 2024 | 10:46 AM

Share

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తండ్రయ్యాడు. ఆయన సతీమణి రితిక శుక్రవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే వీరికి ఓ కూతురు(సమైరా) ఉన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రితికా బాబుకు జన్మనివ్వడంతో రోహిత్ శర్మ కుటుంబం సంబరాల్లో మునిగితేలింది. అటు హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ కూడా ‘రోహిత్ వారాసుడొచ్చాడోచ్..’ అంటూ ట్విట్టర్ వేదికగా కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. రోహిత్ శర్మ, రితికాల ప్రేమ వివాహం 2015, డిసెంబర్ 13న ఘనంగా జరిగింది. ఇక వీరి ప్రేమకు గుర్తుగా 2018, డిసెంబర్ 30న ఓ పాప పుట్టింది. ఆమెకు సమైరా అని నామకరణం చేసిన విషయం విదితమే.

ఇది చదవండి: మీరు పుట్టిన తేదీని బట్టి మీ వెనకున్న దేవుడెవరో చెప్పొచ్చు.! ఎలాగో తెల్సా

ఇవి కూడా చదవండి

ఇక రితికా డెలివరీ విషయంపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు నుంచి తనను మినహాయించాలని రోహిత్ శర్మ బీసీసీఐను కోరిన సంగతి తెలిసిందే. దానికి బోర్డు కూడా అంగీకారం తెలిపింది. దీనిపై విమర్శలు సైతం వెల్లువెత్తాయి. అయితే వ్యక్తిగత, కుటుంబ కారణాలతో ఆటగాళ్లు మ్యాచ్‌లకు దూరం కావడం ఇదేం కొత్త కాదు.. గతంలోనూ విరాట్ కోహ్లీ సిరీస్ మధ్యలోనే తండ్రయిన సందర్భం లేకపోలేదు. కాగా, ఈ నెల 22న ఆస్ట్రేలియాతో జరగాల్సిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులో ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ వార్త నిజమైతే.. భారత జట్టుకు ఇది నిజంగానే గుడ్ న్యూస్ అని చెప్పాలి.

ఇది చదవండి: తస్సాదియ్యా.! పే..ద్ద టాస్కే ఇది.. పామును గుర్తిస్తే మీరే తెలివైనవారే

ఇది చదవండి: బాబోయ్.. అది రోడ్డు కాదు భారీ కొండచిలువ.. పట్టు జారితే పరలోకానికే

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అవిసె గింజల పొడి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఈ వ్యాధులు మటుమాయం
అవిసె గింజల పొడి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఈ వ్యాధులు మటుమాయం
Chanakya Niti: ఓటమిని కూడా విజయంగా మార్చే సూత్రాలు ఇవే
Chanakya Niti: ఓటమిని కూడా విజయంగా మార్చే సూత్రాలు ఇవే
ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి