AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొలుత 19తో బరిలోకి.. ఆ తర్వాత 45 ఫిక్స్.. అసలు రోహిత్ శర్మ జెర్సీ నంబర్ వెనుక ఇంత జరిగిందా..?

Rohit Sharma Jersey No. 45: రోహిత్ శర్మ అనగానే గుర్తొచ్చేది ఆయన జెర్సీ నంబర్ 45. అయితే ఈ నంబర్ వెనుక పెద్ద ప్లానింగ్ ఏమీ లేదు. తన తల్లి సలహా, రాహుల్ ద్రవిడ్ నంబర్ 19తో ముడిపడిన ఆసక్తికరమైన కథ ఉంది. తన గేమింగ్ రియాలిటీ షో "ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ"లో హిట్‌మ్యాన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.

తొలుత 19తో బరిలోకి.. ఆ తర్వాత 45 ఫిక్స్.. అసలు రోహిత్ శర్మ జెర్సీ నంబర్ వెనుక ఇంత జరిగిందా..?
Rohit Sharma Jersey 45 Story
Venkata Chari
|

Updated on: Nov 03, 2026 | 4:35 PM

Share

Rohit Sharma Jersey No. 45: రోహిత్ శర్మ (Rohit Sharma) మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు అభిమానులు అతడి జెర్సీ నంబర్ 45ను తక్షణమే గుర్తుపడతారు. కానీ ఆ నంబర్ ఎంచుకోవడం వెనుక ఉన్న కథ అతడి తొలినాళ్ల క్రికెట్, మాజీ భారత కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid), ముఖ్యంగా అతడి తల్లితో ముడిపడి ఉంది. ఈ విషయాలను రోహిత్ ఇటీవల తన గేమింగ్ రియాలిటీ షోలో పంచుకున్నాడు.

తొలుత ఎంచుకున్న నంబర్ 19..

నంబర్ ఉన్న జెర్సీ ధరించి తొలిసారి క్రికెట్ ఆడినప్పుడు 5, 8, 9 వంటి ప్రముఖ నంబర్లన్నీ ఇతర ఆటగాళ్లు ఇప్పటికే తీసుకున్నారని రోహిత్ చెప్పాడు. తనకు సింగిల్ డిజిట్ నంబర్ కావాలనుకున్నా అన్నీ పోవడంతో మిగిలింది 19 మాత్రమే. ఆ నంబర్ తనకు ఊరికే నచ్చిందని, అందుకే అండర్-19లో అదే నంబర్‌తో ఆడానని చెప్పాడు.

ద్రవిడ్ నంబర్‌తో సమస్య..

అయితే భారత సీనియర్ జట్టులో 19 నంబర్ వేసుకోవడం సాధ్యం కాదని త్వరలోనే రోహిత్‌కు తెలిసింది. ఆ సమయంలో రాహుల్ ద్రవిడ్ భారత కెప్టెన్‌గా ఉండి, 19 నంబర్ జెర్సీతో ఆడేవాడు. అండర్-19లో ఓకే కానీ భారత జట్టులో ఆడితే ఆ నంబర్ తీసుకోలేవని తనతో ఆడుతున్న ఓ ఆటగాడు చెప్పాడని రోహిత్ గుర్తుచేసుకున్నాడు. ఆ ఆటగాడి పేరు ఇప్పుడు గుర్తురావడం లేదని అన్నాడు.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: Rohit Sharma: కివీస్‌తో వన్డే సిరీస్‌.. రోహిత్ ముందు 5 భారీ మైలురాళ్లు.. ఆ క్లబ్‌లో తొలి బ్యాటర్‌గా రికార్డ్..?

అమ్మ సలహా కోరిన రోహిత్..

వెంటనే మరో నంబర్ ఎంచుకోకుండా, రోహిత్ తన తల్లిని సలహా అడగాలని నిర్ణయించుకున్నాడు. ఆ సాయంత్రం హోటల్‌కు చేరుకున్న వెంటనే అమ్మకు ఫోన్ చేసి, ఆ నంబర్‌తో ఆడలేనని చెప్పి, ఏ నంబర్ తీసుకోవాలో అడిగాడు.

అతడి తల్లి 9 నంబర్ సూచించింది. అది నీకు అదృష్టం తెస్తుందని చెప్పింది. కానీ ఆ నంబర్ అప్పటికే ఇతరుల వద్ద ఉంది. 27 నంబర్ మాత్రం తనకు వద్దనుకున్నాడు.

ఎక్కువమంది చదివినది: W,W,W,W,W,W,W,W,W.. ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లతో చెలరేగిన టీమిండియా ప్లేయర్..!

చివరికి 45 ఎందుకు?

అప్పుడు రోహిత్‌కు 4, 5 అంకెలు పక్కపక్కన ఉంటే చాలా బాగుంటాయనిపించింది. పైగా 4+5 కూడా 9 అవుతుంది. ఈ విషయాన్ని తల్లికి చెప్పి, ఈ నంబర్ తీసుకుంటానని అన్నాడు. అటు 9కి సమానం, ఇటు జెర్సీ మీద 4-5 చూడటానికి బాగుంటుందని వివరించాడు. అలా తల్లి సలహా, తన అభిరుచి కలిసి 45 నంబర్ రోహిత్ గుర్తింపుగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. పక్కా కొలతలతో
ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. పక్కా కొలతలతో
చరిత్ర సృష్టించిన సైమన్ హర్మర్.. 130 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
చరిత్ర సృష్టించిన సైమన్ హర్మర్.. 130 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో
శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో
శుక్రవారం ఈ చిన్న పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో..
శుక్రవారం ఈ చిన్న పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో..
ఆ హీరోయిన్ కు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని..
ఆ హీరోయిన్ కు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని..
ఈ 5 రకాల వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకండి.. జీవితంలో..
ఈ 5 రకాల వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకండి.. జీవితంలో..
3 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మరి ఇప్పుడేం చేస్తున్నారంటే
3 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మరి ఇప్పుడేం చేస్తున్నారంటే
'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం
'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం
లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..