AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vsPAK: ’60 బంతుల్లోనే సెంచరీ.. పాక్ జట్టుకు ఆయనతో ఇబ్బందే’.. ఇచ్చిపడేసిన యూవీ

Yuvraj Singh Comments on Rohit Sharma: రేపు దుబాయ్‌లో పాకిస్తాన్ వర్సెస్ భారత్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరుజట్లు ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు సిద్ధంగా ఉన్నాయి. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్, కోహ్లీలపై ప్రశంసలు కురింపించాడు.

IND vsPAK: '60 బంతుల్లోనే సెంచరీ.. పాక్ జట్టుకు ఆయనతో ఇబ్బందే'.. ఇచ్చిపడేసిన యూవీ
Team India
Venkata Chari
|

Updated on: Feb 22, 2025 | 3:10 PM

Share

Yuvraj Singh Comments on Rohit Sharma: భారత జట్టు వన్డే, టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ కోల్పోయిన ఫామ్‌ను తిరిగి పొందాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అతను అద్భుతమైన సెంచరీ సాధించాడు. అదే సమయంలో, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ‘హిట్‌మ్యాన్’ పాత శైలి కనిపించింది. కానీ, రోహిత్ ఈ టోర్నమెంట్‌లో తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించగలడా లేదా అనేది కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడనున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు, భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రోహిత్ గురించి ఒక భారీ అంచనా వేశాడు. రోహిత్ తన లయలో ఉంటే, అతను 60 బంతుల్లో కూడా సెంచరీ చేయగలడంటూ చెప్పుకొచ్చాడు.

రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించిన యువరాజ్ సింగ్..

పాకిస్థాన్‌పై రోహిత్ బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ వస్తుందని భారత అభిమానులందరూ ఆశిస్తున్నారు. అయితే, పాకిస్తాన్ జట్టులో షాహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్, నసీమ్ షా వంటి ప్రమాదకరమైన బౌలర్లు ఉన్నందున రోహిత్ భారీ స్కోరు చేయడం అంత సులభం కాదు.

ఇవి కూడా చదవండి

జియో హాట్‌స్టార్ షోలో రోహిత్ శర్మ గురించి యువరాజ్ మాట్లాడుతూ, ‘అతను ఫామ్‌లో ఉంటే, 60 బంతుల్లో సెంచరీ చేయగలడు. ఇది అతని ప్రత్యేకత. రోహిత్ కేవలం ఫోర్లు కొట్టడమే కాదు, సిక్సర్లు కూడా కొట్టి బంతిని స్టాండ్స్‌లోకి పంపుతాడు. అతను షార్ట్ బాల్‌ను అద్భుతంగా ఆడే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. ఎవరైనా 145-150 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసినా, రోహిత్ దానిని సులభంగా హుక్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాడు. అతని స్ట్రైక్ రేట్ ఎప్పుడూ 120-140 మధ్య ఉంటుంది. అతని రోజున ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగలడు’ అంటూ చెప్పుకొచ్చాడు.

విరాట్ కోహ్లీపైనా ప్రశంసలు..

“రోహిత్, విరాట్ ఫామ్ ఏదైనా, వారు ఎల్లప్పుడూ జట్టుకు అతిపెద్ద మ్యాచ్ విన్నర్లుగా ఉంటారు. నేను ఎల్లప్పుడూ నా మ్యాచ్ విన్నర్లకు మద్దతు ఇస్తాను. వన్డే క్రికెట్‌లో, ముఖ్యంగా వైట్-బాల్ ఫార్మాట్‌లో, విరాట్ కోహ్లీతో పాటు బ్యాట్స్‌మన్‌గా అతను భారతదేశానికి అతిపెద్ద మ్యాచ్ విన్నర్. రోహిత్ ఇబ్బంది పడుతున్నప్పటికీ పరుగులు సాధిస్తే, అది ప్రత్యర్థి జట్టుకు ప్రమాదకరం’ అని యువరాజ్ తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా