
Rohit Sharma Video: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్స్‌లో టీమిండియా ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ టోర్నమెంట్‌లో భారత్ 5వ సారి ఫైనల్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియాపై విజయంలో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించారు. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిన ఒక షాట్ కూడా చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆస్ట్రేలియా ఇచ్చిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ శర్మ భారత్‌కు సూపర్ ఫాస్ట్ ఆరంభాన్ని అందించాడు. అతను తనదైన దూకుడు శైలిలో ఫోర్లు కొట్టడం ప్రారంభించాడు. అయితే, ఆ ఇన్నింగ్స్ ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే అతను కూపర్ కొన్నోలీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. రోహిత్ 29 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 28 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ స్ట్రైయిట్ బౌండరీ బాదేశాడు. అయితే, బంతి అంపైర్ వైపు చాలా వేగంగా దూసుకొచ్చింది. తనను తాను రక్షించుకోవడానికి అంపైర్ పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. తృటిలో అంపైర్ తప్పించుకున్నాడు, లేదంటే ప్రాణాపాయం జరిగేదే.
SMASHED IT!
Rohit Sharma’s boundary has everyone thinking, should umpires start wearing helmets?#ChampionsTrophyOnJioStar 👉 🇮🇳🆚🇦🇺 LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2 & Sports18-1!
📺📱 Start Watching FREE on JioHotstar: https://t.co/B3oHCeWFge pic.twitter.com/cAbrKgMezk
— Star Sports (@StarSportsIndia) March 4, 2025
ఇది నాథన్ ఎల్లిస్ ఓవర్‌లో చోటు చేసుకుంది. ఆరో ఓవర్ చివరి బంతికి భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్రంట్ ఫుట్‌లో ఫవర్ ఫుల్ షాట్ కొట్టాడు. 4 పరుగులు వచ్చాయి. అతను ఈ షాట్‌ను చాలా సూటిగా, వేగంగా కొట్టాడు. అంపైర్ క్రిస్ గాఫ్నీ పక్కకు తప్పుకోకపోతే, బంతి అతనికి తగిలి ఉండేది. రియాక్షన్ సమయం చాలా తక్కువగా ఉంది. దీని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సంఘటన తర్వాత, రోహిత్ శర్మ, అంపైర్ క్రిస్ గాఫ్నీ నుంచి ఆశ్చర్యకరమైన రియాక్షన్స్ వచ్చాయి. రోహిత్ శర్మ నాలుక బయటపెట్టి చిన్నగా నవ్వాడు. అదే సమయంలో, రోహిత్ షాట్‌కి భయపడ్డానంటూ అంపైర్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు.
ఈ విజయంతో, 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు ఆస్ట్రేలియాపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. అప్పుడు కంగారూ జట్టు తన సొంత మైదానంలో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్‌ను ఓడించి ప్రపంచ కప్ గెలవాలనే భారత కలను చెదరగొట్టింది. అంత దగ్గరగా వచ్చిన తర్వాత కూడా టైటిల్ గెలవలేకపోయినందుకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీమిండియా ఫ్యాన్స్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అయితే, రోహిత్ సైన్యం ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను ఓడించడం ద్వారా దీనికి ప్రతీకారం తీర్చుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..