Rohit Sharma: రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ఆ రికార్డ్ సాధించిన తొలి క్రికెటర్ అతనే
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అరుదైన ఘనత సాధించాడు. టీ-20 ల్లో 300 ఫోర్లు కొట్టిన రెండో బ్యాట్స్ మెన్ గా రికార్డు సాధించాడు. బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ-20లో హిట్ మ్యాన్ ఈ రికార్డును అందుకున్నాడు. కాగా ఈ...
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అరుదైన ఘనత సాధించాడు. టీ-20 ల్లో 300 ఫోర్లు కొట్టిన రెండో బ్యాట్స్ మెన్ గా రికార్డు సాధించాడు. బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ-20లో హిట్ మ్యాన్ ఈ రికార్డును అందుకున్నాడు. కాగా ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్ రోహిత్ శర్మే కావడం విశేషం. ఐర్లాండ్ స్టార్ ప్లేయర్ పాల్ స్టిర్లింగ్ 325 ఫోర్లతో మొదటిస్థానంలో కొనసాగుతున్నాడు. అతని తర్వాత 301 ఫోర్లతో రెండో స్థానంలో రోహిత్ నిలిచాడు. విరాట్ కోహ్లి మూడో స్థానంలో ఉన్నాడు. సిక్సర్ల విషయంలో గప్తిల్ (165) తొలి స్థానంలో ఉండగా.. రోహిత్(157) సిక్స్‌లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న ఇంగ్లండ్- ఇండియా (England – India) రెండో టీ-20లో భారత్ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని 121 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో 49 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో గెలుపుతో టీమ్ ఇండియా సిరీస్ ను గెలుచుకుంది.
మొదట నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 170పరుగులు చేసింది. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 121 పరుగులకే ఆలౌట్ అయింది. హర్షల్ పటేల్ వేసిన 17వ ఓవర్ చివరి బంతికి పార్కిన్‌సన్ (0) బౌల్డవడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మరోవైపు డేవిడ్ విల్లే (33) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి